కోవిషీల్డ్, కోవాగ్జిన్.. యూరప్ దేశాలకు భారత్ వార్నింగ్

Update: 2021-07-01 09:32 GMT
ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న గాంధీ మహాత్ముడి ఆశయాలు ఇప్పుడు భారత్ లో లేవు. అందునా కేంద్రంలోని వారి వారసులుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి అస్సలు లేవు. మహాత్మాగాంధీ రాష్ట్రం నుంచే వచ్చిన మోడీ ఈ విషయంలో మునుపటి భారత్ వైఖరికి.. నేటి ఆధునిక భారత్ వైఖరికి స్పష్టమైన మార్పును తీసుకొచ్చింది.

ఇన్నాళ్లు పాకిస్తాన్ దాడి చేసినా.. చైనా ఈసడించుకున్నా.. ఇతర దేశాలు ఎన్ని అన్నా భారతదదేశం దులుపుకొని పోయింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల అసక్తత వల్ల దేశానికి ఎన్ని గాయాలు, అవమానాలు అయినా భారత్ అన్నీ భరించే దేశంగా ముద్రపడింది.

కానీ మోడీ సర్కార్ వచ్చాక తీరు మారింది. ఏకంగా కొట్లాటకు వస్తున్న పాకిస్తాన్ వెళ్లి మరీ విమానాలతో దాడి చేయగల సామర్థ్యం వచ్చింది. చైనాతో తలపడి చంపే మొండి ధైర్యం వచ్చింది. ఇదంతా మోడీ సర్కార్ వల్లే.

ఇప్పుడు యూరోపియన్ యూనియన్ చేస్తున్న చెలగాటానికి భారత్ చెక్ చెప్పింది. స్వయంగా ఈయూలోని బ్రిటన్ తయారు చేసిన కోవీషీల్డ్ టీకా వేసుకున్నా సరే వాటిని ఆమోదించకుండా యూరప్ లోకి ఎంట్రీ నిషేధాజ్ఞలు పెడుతున్న యురోపియన్ దేశాలకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్ లో కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేసుకున్న వారిని అనుమతించాలని లేదంటే యూరప్ దేశాల వారిని తాము కూడా అనుమతించమని.. క్వారంటైన్ చేస్తామని హెచ్చరించింది.

దీంతో ఈయూ దేశాలు ఇప్పుడు భారత్ హెచ్చరికల నేపథ్యంలో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. భారత్ నుంచి ఇలాంటి స్పందన వస్తుందని ఈయూ కూడా ఊహించలేకపోయింది. కోవీషీల్డ్ ఆమోదం లభించకపోవడంతో ఈ టీకా పొందిన వారు ఐరోపా సభ్యదేశాల్లో ప్రయాణం చేయలేరన్న ఆందోళనలు నెలకొన్న క్రమంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Tags:    

Similar News