యాహూ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే?

Update: 2015-12-22 05:32 GMT
ఒక ఏడాది ముగిసి మరో ఏడాది ఎంటర్ అవుతున్న వేళ.. పలు సంస్థలు.. జరిగిన ఏడాదికి సంబంధించిన చాలానే లెక్కలు వేస్తుంటాయి. ఏడాదిలో అత్యంత ప్రభావం చూపిన అంశాలేంటి? సూపర్ హిట్ అయిన సినిమాలేంటి? ప్రభావవంతమైన వ్యక్తి ఏమిటి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఈ మధ్యనే గూగుల్ తన సెర్చింజన్ లో వెతికే వివిధ అంశాలకు సంబంధించిన వివరాలకు ర్యాంకులు ఇచ్చిమరీ విడుదల చేసింది.

ఈ తరహాలోనే యాహూ.. పర్సనాలిటీ ఆఫ్ ధ ఇయర్ గా ప్రకటించిన వైనం ఆసక్తిని రేపటంతో పాటు.. ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే.. యాహూ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గా కోట్లాది మంది హిందువులు భక్తితో పూజించే ఆవును ఎంపిక చేశరు. ఇదెలా అంటే.. ఈ ఏడాది బీఫ్ నిషేధం మొదలు కొని అసహనంపై ఆన్ లైన్ లో భారీ చర్చకు తావిచ్చిన ‘‘ఆవు’’ మించి మరెవరు పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక అవుతారంటూ చెబుతోంది.

బీఫ్ పై మహారాష్ట్ర సర్కారు బ్యాన్ విధించిన తర్వాత ఆవు ఒక ఐకాన్ గా మారిందని.. 2015లో భారత్ సమీక్షలో భాగంగా ఆవుకు ఈ ఘనతను కట్టబెట్టారు. రోజూవారీ షేరింగ్ తో పాటు.. చదివే అంశాల్ని ప్రాధాన్యతగా తీసుకొని ఈ ఎంపిక ఉంటుంది.
Tags:    

Similar News