తమిళనాడులోని కుంభకోణం ఆలయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మంది కారణంగా బెదిరిన ఆవు.. ఏకంగా రాష్ట్ర మంత్రివర్యుల్ని భయంతో ఉరికించిన ఘటన చోటు చేసుకుంది. అటు ఆవు.. ఇటు మంత్రి.. ఇరువురు పరుగులు తీయటానికి కారణం భయం సెంట్రల్ పాయింట్ కావటం గమనార్హం. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకున్నది చూస్తే..
వర్షం కోసం కుంభకోణం ఆలయంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. ఈ ఒక్క ప్రాంతంలోనే కాక.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ యాగాన్ని నిర్వహించారు. అధికార పార్టీ నిర్వహిస్తున్న యాగం కావటంతో హడావుడి ఎంత ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక.. కుంభకోణంలోని కుంభేశ్వరన్ ఆలయం వద్ద నిర్వహించిన యాగానికి రాష్ట్ర మంత్రి దురైకన్ను హాజరయ్యారు.
మంత్రిగారు వచ్చిన కార్యక్రమం కావటంతో మంది కూడా బాగా హాజరయ్యారు. వీరిలో అధికారపార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున యాగం వద్దకు చేరుకున్నారు. యాగం జరుగుతున్న వేళ ధ్వజస్తంభం సమీపానికి ఆవును.. దూడను తీసుకొచ్చారు. గో పూజ చేసేందుకు ఆర్చకస్వామితో పాటు మంత్రి వెళ్లారు. మంత్రి వెంట పెద్ద ఎత్తున నేతలు కూడా కదలటంతో ఆవు బెదిరిపోయింది.
అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న ఆవు బెదిరిపోయి.. మంత్రి వైపుకు దూసుకొచ్చింది. అదే సమయంలో ఆవుకు మంత్రి నమస్కరించే ప్రయత్నంలో ఉన్నారు. తన వైపునకు వస్తున్న ఆవు నుంచి తప్పించుకునేందుకు భయంతో పరుగుతు తీశారు. ఆవును కంట్రోల్ చేయాల్సిన వ్యక్తి చేతికున్న తాడును సైతం వదిలించుకున్న ఆవు పరుగులు తీసింది.
దీంతో అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. భయంతో పరుగులు తీసిన ఆవు కారణంగా అన్నాడీఎంకేకు చెందిన కార్యకర్త ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను కుంభకోణం ఆసుపత్రికి తరలించారు. బెదిరిన మంత్రి పరుగులు తీసిన వైనం అక్కడ గందరగోళానికి గురయ్యేలా చేసింది. మంది ఉన్నప్పుడు పశువులు బెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో దొర్లిన పొరపాటు ఇంత జరగటానికి కారణమైంది.