టైం బాగోనప్పుడు టెంకాయ సైతం టైంబాంబ్ మాదిరి పేలుతుందని ఊరికే చెప్పరు. తాజాగా ఉదంతాన్ని చూస్తే.. ఈ మాటలో నిజం ఎంతన్నది ఇట్టే అర్థం కాక మానదు. మంచి జరుగుతుందని. శుభం చేకూరుతుందని..కీలకమైన ఎన్నికల వేళ గో సెంటిమెంట్ కొత్త ఉత్సాహాన్ని తెచ్చి పెడుతుందనుకుంటే.. అక్కడ జరిగిన ఘటన తెలుగు తమ్ముళ్లకు గుండెలు జారిపోయేలా చేసింది.
బెజవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేళ.. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న బొండా ఉమకు గోవు ఎదురు తీసుకొస్తే మంచిదని కొందరు కార్యకర్తలు భావించారు. శుభసూచకంగా ఉంటుందని భావించి ఒక బక్క ఆవును తీసుకొచ్చారు.
అయితే.. ఈ ఆవు అక్కడి జనాల్ని చూసి బెదిరింది. అంతే..అది కాస్తా ఎదురు తిరిగి పరుగు పెట్టింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడి టీడీపీ కార్యకర్తలు.. నేతలతో పాటు ఉమా సతీమణి.. వారి బంధువులు.. ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. చివరకు బొండా అనుచరులు గోవును పట్టుకొని దాన్ని శాంతింపచేసి.. ఆయన వాహనం ఎదుటకు తీసుకొచ్చారు. శుభం జరుగుతుందని భావించిన ఎపిసోడ్ లో చోటు చేసుకున్న షాకింగ్ పరిణామం అక్కడి వారికి దడ పుట్టేలా చేసిందని చెప్పక తప్పదు.