బీకాంలో ఫిజిక్స్.. ఆవు ఆక్సిజన్ విడుదల

Update: 2018-09-21 09:09 GMT
బీకాంలో ఫిజిక్స్ చదివిన మన టీడీపీ ఎమ్మెల్యేను చూశాం.. ముక్కున వేలేసుకున్నాం.. ఉప్పుడు ఆవులు ఆక్సిజన్ ను విడుదల చేస్తాయన్న మంత్రి గారిని ఇప్పుడే చూస్తున్నాం.. అవుతోపాటు భూమ్మీద ఏ జీవ రాశి అయినా సరే ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డై అక్సైడ్ ను విడుదల చేస్తాయి. ఇది మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్నాం.. ఎన్నో పరిశోధనలు కూడా ఇదే తేల్చాయి. అదే సమయంలో మొక్కలు, చెట్లు మాత్రం మనకూ పూర్తి డిఫెరెంట్.. అవి కార్బన్ డై అక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను విసర్జిస్తాయి. అందుకే మొక్కలు మనకు ప్రాణదాతలు అని అంటుంటారు. ఇంత చిన్న లాజిక్ ను ఏ 3వ తరగతి స్టూడెంట్ ను అడిగినా చెబుతారు. కానీ ఉత్తరాఖండ్ మంత్రికి మాత్రం తెలియకపోవడం గమనార్హం.

తాజాగా ఉత్తరఖాండ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానం సందర్భంగా మాట్లాడిన ఉత్తరాఖండ్ పశుసంవర్ధకశాఖ మంత్రి రేఖా ఆర్య ఆవుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

రేఖా ఆర్య మాట్లాడుతూ.. ‘ఆవు ఆక్సిజన్ ను తీసుకోవడమే కాదు.. బయటకు కూడా ఆక్సిజనే విడుదల చేస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమె ఇంత తెలివితక్కువ మాట మాట్లాడేసరికి బయటకొచ్చాక విలేకరులు దీని గురించి వివరణ కోరారు. దీనిపై రేఖ ఆర్య మాట్లాడుతూ ‘ఆవు ఆక్సిజన్ ను తీసుకొని అదే ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. ఆవు నుంచి స్వచ్ఛమైన పాలు వస్తాయి. నెయ్యి తయారవుతుంది. దీంతో ఆవులో ఎలాంటి చెడు ప్రక్రియ జరగదు. చెడు శక్తికానీ ఉండదు. ఈ లెక్క ప్రకారం కచ్చితంగా చెప్పగలను ఆవు ఆక్సిజన్ ను మాత్రమే విడుదల చేస్తుంది’ అని తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. మంత్రిగారి సమాధానంతో అవాక్కైన జర్నలిస్టులు వెంటనే ఢిల్లీలోని జువాలజీ ప్రొఫెసర్ ను కలిసి ఇది నిజమేనా అడిగేశారు.. ఆమె మాటలు తప్పు అని నిరూపించడానికి ఈ పని చేవారు..

‘మనుషులు 21శాతం ఆక్సిజన్ ను లోపలికి పీల్చుకుంటే అందులో మన శరీరం  4 నుంచి 5శాతం మాత్రమే వినియోగించుకుంటాం.మిగతాది బయటకు విడుదల చేస్తాం. బయటకు కార్బన్ డై అక్సైడ్ తోపాటు ఇతర వాయువులు విడుదలవుతాయి’ అని జువాలజీ ప్రొఫెసర్ వివరించారు. ఇదే పద్ధతి ఆవుకు ఇతర జీవరాశులకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి నోట్లో వెలక్కాయ పడ్డట్టయ్యింది.
Tags:    

Similar News