హైదరాబాద్ శివారున జరిగిన రేవ్ పార్టీ గుట్టు రట్టు అయ్యింది. ఓ రిసార్ట్ లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న 90మందికి పైగా అమ్మాయిలు, అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఇంతమంది ఇక్కడ పట్టుబడడం.. ఇంకొంత మంది పారిపోవడంతో చాలా పెద్ద సంఖ్యలోనే ఇక్కడ పార్టీ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
దాదాపు 90మంది అబ్బాయిలు, అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రిసార్ట్ లో 20 కార్లు, 60 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో మరికొంత మంది పరారైనట్టు తెలుస్తోంది. వారి కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ పార్టీలో నార్కోటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, ఎల్ సీడీ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
ఓ రాజకీయ పార్టీ నేత కుమారుడి ఫాంహౌస్ లో ఈ పార్టీ జరగడంతో పొలిటికల్ యాంగిల్ ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇది వీకెండ్ పార్టీనా? లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకే నిర్వహించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రేవ్ పార్టీపై ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అంతరాత్మ ప్రొడక్షన్స్ పేరుతో గిరీష్ అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టాడని తెలిపారు. నిర్వాహకులపై కేసులు పెట్టామన్నారు.ఇక ఈ పార్టీలో పాల్గొన్న వారంతా సాఫ్ట్ వేర్ తోపాటు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులేనని చెప్తున్నారు. దాదాపు 96మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్నారు. పరారైన 10 మంది కోసం గాలిస్తున్నామన్నారు.