కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్స్సిస్ట్).. సింపుల్ గా చెప్పాలంటే సీపీఎం - ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ... వాడుకలో కాంగ్రెస్. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు పేర్లు మార్చుకోమంటున్నారు ఓ బీజేపీ లీడర్. రెండు పార్టీల పేర్లలోనూ ఇండియా అన్న పదం ఉందని.. కానీ, ఆ పార్టీలు రెండూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి కాబట్టి తమ పేర్లలోని ఇండియా అన్న పదాన్ని తొలగించుకోవాలని ఆయన సూచన చేస్తున్నారు.
దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు పలుకుతున్నందుకు కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా మార్క్సిట్ (సీపీఎం), భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్)లు తమ పార్టీ పేరులో ఉన్న ఇండియా అన్న పదాన్ని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మ ఆ రెండు పార్టీలపై మండిపడ్డారు. జెఎన్ యూలో ఒక వర్గం విద్యార్థులు బహిరంగంగా భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ అప్ఝల్ గురు వంటి ఉగ్రవాదులకు మద్దతు పలకడాన్ని యావత్ దేశం గర్హిస్తోందన్న ఆయన అలాంటి విద్యార్థుల వైఖరిని ఖండించాల్సింది పోయి సీపీఎం - కాంగ్రెస్ లు వారికి మద్దతు పలుకుతూ ఆందోళనలకు దిగుతున్నాయని విమర్శించారు. జెఎన్ యు విద్యార్థి సంఘం నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర హోంమంత్రిని కలవడాన్ని దినేశ్ శర్మ తప్పుపట్టారు.
దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు పలకడం కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు పలికినట్లే అవుతుందని... ఆ పని చేస్తున్న సీపీఎం - కాంగ్రెస్ లు దేశ వ్యతిరేక శక్తుల కింద లెక్కని ఆయన మండిపడుతున్నారు. అందుకే తమ పేర్లలో ఉన్న ఇండియా అన్న పదం తొలగించుకోవాలని సూచిస్తున్నారు.