పరుష వ్యాఖ్యలు చేయటంలో సీపీఐ నారాయణ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. నోటికి వచ్చినట్లుగా ఆయన మాట్లాడేస్తారు. ఆయన మాటల ధాటికి మామూలు నేతలు తట్టుకోవటం కాస్త కష్టమే. ఆయన నోటికి తాళం వేయగలిగిన నేత ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాత్రమే చెప్పాలి. మాట అనటం.. అనిపించుకోవటం మామూలైన నారాయణ.. ఆ మధ్యన బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడ్ని ఉద్దేశించి.. ఆయన పంచెలు వదిలేసి.. ఫ్యాంట్లు వేసుకోవాలని చెప్పటం.. పంచెలు వేసుకొని వస్తే.. దాన్ని విప్పదీసి కొడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దీనిపై వెంకయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పంచెలో ఏముందో తెలుసుకోవాలని కమ్యూనిస్టులు ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అదే విషయాన్ని ప్రస్తావించిన నారాయణ.. వెంకయ్య పంచెలో ఏమీ లేదని ఎటకారం చేసేశారు. ‘‘ఆయన పంచెలో ఏం లేదని ఆయనకు.. మాకు తెలుసు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది’’ అని వ్యాఖ్యానించారు.
వెంకయ్య ఎపిసోడ్ తో పాటు.. తాజాగా ఏపీ అధికార.. విపక్ష అధినేతలపై హోల్ సేల్ విమర్శలు చేసేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. విపక్ష నేత వైఎస్ జగన్ లపై విమర్శలు చేసిన ఆయన.. ఈ ఇద్దరు నేతలు కలిసి దొంగాట ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. రాయలసీమలో కరవు.. తాగునీటి సమస్యలతో అల్లాడుతుంటే.. వాటి పరిష్కారం గురించి చర్చించకుండా దొంగాట ఆడుతున్నారని మండిపడ్డారు.