మిగిలిన రాజకీయ నేతల మాటలకు భిన్నంగా ఉంటాయి కామ్రేడ్ నారాయణ మాటలు. ఆయన నోట వచ్చే మాటలు తూటాల్లా పేలుతుంటాయి. రాజకీయాల్లో ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడే కమ్యూనిస్ట్ నేత ఎవరైనా ఉన్నారంటే నారాయణ మాత్రమే చప్పున గుర్తుకు వస్తారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో దిట్ట అయిన నారాయణ.. ఈ మధ్యన కొద్దికాలంగా కామ్ గా ఉంటున్నారు.
తాజాగా ఆయన మళ్లీ మరోసారి నోరు విప్పారు. ఇటీవల కాలంలో ఎవరూ చేయలేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా.. ఆయన కుటుంబ సభ్యుల మీదా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇందిరాపార్కు వద్దనున్న ధర్నాచౌక్ ను హైదరాబాద్ శివారుకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపైన పలువురు మండిపడుతున్న సంగతి తెలిసిందే. సేవ్ ధర్నా చౌక్ పేరుతో గత కొద్దికాలంగా వరుసగా నిరసన కార్యక్రమం జరుగుతోంది.
తాజాగా జరిగిన నిరసనలో పాల్గొన్న నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రావాళ్ల మోచేతి నీళ్లు తాగేవారు తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే.. అది కేసీఆర్ కుటుంబమేనంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నారాయణ.. అధికారిక కార్యక్రమాల్లో కేసీఆర్ మనమడు కనిపిస్తుండటాన్ని తప్పు పట్టారు. చూస్తుంటే.. పదేళ్ల తర్వాత కేటీఆర్ కాదు.. ఆయన కొడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేలా ఉన్నాడంటూ ఎద్దేవా చేసిన నారాయణ.. కేసీఆర్ చనిపోతే.. ఎవరూ చూసే దిక్కుండదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కానీ చనిపోతే నిజాం మాదిరి.. ఆయన సంతాప సభ పెట్టేవారు ఉండరంటూ ఫైర్ అయ్యారు. ధర్నా చౌక్ తరలింపుపై ఆగ్రహం ఉండటం తప్పేం కాదు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టటం ఓకే. కానీ.. వ్యక్తిగతంగా ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయటం మాత్రం అంత సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. .
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/