కేసీఆర్ కాల‌గ‌ర్భంలో క‌లుస్తాడట

Update: 2017-02-14 05:22 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై సీపీఐ జాతీయ‌ కార్యదర్శి నారాయణ విరుచుకుప‌డ్డారు. సామాజిక న్యాయం - తెలంగాణ సమగ్రాభివృద్ధి ఎజెండాతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర‌భ‌ద్రం నేతృత్వంలో జరుగుతున్న మహాజన పాదయాత్ర ఖమ్మం జిల్లాకు చేరిన సందర్భంగా పాదయాత్రకు నారాయణ మద్దతు తెలిపి బహిరంగ సభలో ప్రసంగించారు. 'తెలంగాణ ఉద్యమంలో అందరినీ నమ్మించావ్‌ గారడీ మాటలతో ఓట్లు పొంది అధికారంలో కొచ్చావ్‌.. అధికారం ఉందన్న అహంకారంతో కమ్యూనిస్టులపై కారుకూతలు కూస్తున్నావ్‌... మాతో పెట్టుకుంటే నీ ప్రభుత్వం పతనం కావడం ఖాయం.. నువ్వు కాలగర్భంలో కలిసిపోవడం తథ్యం' అని నారాయ‌ణ హెచ్చరించారు. రాష్ట్రంలో 93శాతంగా ఉన్న ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ - ఎంబీసీ వర్గాల ప్రజలకు అందాల్సిన సంక్షేమం గురించి సీపీఎం చేస్తున్న పాదయాత్రను విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు. దళిత - గిరిజనుల భూములు లాక్కుంటున్న కేసీఆర్‌ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. రానున్న కాలంలో ఎర్రజెండాలన్నీ ఏకం కావడం ఖాయమనీ, అది ఎంతో దూరంలో లేదని నారాయ‌ణ  అన్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఎందరో ప్రాణత్యాగం చేశారనీ, అలాంటివారి కుటుంబాలకు అన్యాయం చేస్తూ తెలంగాణ ద్రోహులైన తుమ్మల నాగేశ్వ‌ర రావు - తలసాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ - కొండా సురేఖ లాంటి వారితో స్నేహం చేస్తున్నందుకు కేసీఆర్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదనీ నారాయ‌ణ హెచ్చరించారు. తెలంగాణ ద్రోహులతో దోస్తీకట్టిన కేసీఆర్‌ పేదల కోసం తమ్మినేని చేపట్టిన పాదయాత్రను విమర్శించడనికి సిగ్గుండాలన్నారు. దేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ - తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఇద్దరూ అబద్దాల్లో గిన్నిస్‌ బుక్‌ రికార్డుకెక్కారని విమర్శించారు. కూతురు ఉద్యోగం కోసం మోడీతో దోస్తీ కడుతున్నారని నారాయ‌ణ విమర్శించారు. దేశంలో లాల్‌-నీల్‌ జెండాలు ఏకమై మతోన్మాద రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ లోనూ ఎర్రజెండాలన్నీ ఏకమై దొరపాలనను తరిమి కొట్టాలన్నారు. రానున్నకాలంలో కేసీఆర్‌ కు ఎర్ర జెండా సత్తా ఏంటో చూపిస్తామని, అందుకు అన్ని శక్తుల ను ఏకం చేస్తామనీ నారాయ‌ణ‌ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News