వెంకయ్యా..! డబ్బా మాని డబ్బులు తేవయ్యా!!

Update: 2016-09-24 11:35 GMT
పదునైన పంచ్ లకు పేరుగాంచిన సీపీఐ నేత నారాయణ ఈసారి కేంద్ర మంత్రి - బీజేపీ నేత వెంకయ్యనాయుడిపై మండిపడ్డారు. వెంకయ్య నాయుడు సొంత డబ్బా మానుకుని రాష్ట్రానికి నిధులు తేవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

 వెంకయ్యనాయుడు కనుక ఏపీకి రూ.2 లక్షల కోట్ల నిధులు తెస్తే తాను తిరుమల శ్రీవారికి పాదపూజ చేస్తానని... ఒకవేళ వెంకయ్య కనుక నిధులు తేకుంటే ఆయన తన ముక్కును నేలకు రాసుకోవాలని నారాయణ సవాల్ విసిరారు.  వెంకయ్య డబ్బా కొట్టుకోవడం మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. టీడీపీ - బీజేపీ దొందూ దొందే అని నారాయణ ఎద్దేవా చేశారు.

కాగా ఏపీకి నిధులు తెచ్చే విషయంలో నారాయణ గతంలోనూ వెంకయ్యపై విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఏపీకి ఏమీ తేలేకపోయినప్పటికీ అంతా నావల్లే అంటూ వెంకయ్య పదేపదే గొప్పలు చెబుతుండడంతో నారాయణ తనదైన శైలిలో మరోసారి ఆయనపై సెటైర్లు వేశారు. మొత్తానికి జనమే కాదు రాజకీయ నేతలు కూడా వెంకయ్య సొంత డబ్బాను వినలేకపోతున్నారన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News