విషయం ఏదైనా సరే.. తిట్టటమే పనిగా పెట్టుకున్నట్లుగా ఉంటుంది సీపీఎం జాతీయ కార్యదర్శి కె.నారాయణ. ఆయన గళం విప్పారంటే విమర్శనాస్త్రాన్ని సంధించటమే ఉంటుంది. అలాంటి ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో కేసీఆర్ పొలిటికల్ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతుందన్న మాట వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా నారాయణ మాటలు ఉండటం విశేషం.
తాజాగా ఒక టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై ఇప్పటికి పేటెంట్ హక్కులు కేసీఆర్ కే ఉన్నాయన్న ఆయన.. ‘‘కేసీఆర్.. సింబల్ ఆఫ్ తెలంగాణ. ఇది ఎవరూ కాదనలేని నిజం’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే భక్తి భావన ఉన్న వారంతా ఇప్పటికి టీఆర్ఎస్ పక్షాన.. కేసీఆర్ తోనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంతలా పొగిడేసిన ఆయన.. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోస్ట్ అన్ పాపులర్ ప్రధానిగా మోడీ గుర్తింపు పొందారని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత పెరిగినట్లుగా ఆయన విశ్లేషించారు. తిట్టే నారాయణ కేసీఆర్ ను ఇంతలా పొగడటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.