ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావటం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. పలువురు సీపీఐ నేత కామ్రేడ్ నారాయణ ఇంటికి ఫోన్ చేశారట. నారాయణ కుమారుడు అన్న వెంటనే.. సీపీఐ నారాయణ కుమారుడు అనుకొని.. ఆయనకు ఫోన్ చేసి పరామర్శలు చేశారట.
అప్పుడే తనకు ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మరణించిన విషయం తెలిసిందని చెబుతున్నారు సీపీఐ నారాయణ. రోడ్డు ప్రమాదంలో మరణించటం చాలా బాధాకరమైన విషయంగా నారాయణ వ్యాఖ్యానించారు. ఇది నిజంగా ఎంతో దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఎంతో జీవితం ఉన్న నిషీత్ చిన్న వయసులోనే చనిపోవటం బాధాకరమన్నారు. ఆయన మరణం తనను ఎంతో కలిచివేసిందన్న నారాయణ.. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రమాద ఘటన గురించి యువత ఎంతో నేర్చుకోవాలన్నారు. విలువైన జీవితాన్ని వృథా చేసుకోకూడదని.. ఎంత డబ్బులున్నా పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాలేమన్నారు. మంత్రి నారాయణ తనకు వ్యక్తిగతంగా ఎంతో మంచి స్నేహితుడని.. ఆయన కుటుంబంలో ఇంత పెను విషాదం చోటు చేసుకోవటం చాలా బాధగా ఉందన్నారు.