టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ అభిమానులు మరోసారి ఫైర్ అయ్యారు. యువ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ ను పక్కన పెట్టడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు ఫామ్ లో లేని కేఎల్ రాహుల్ లాంటి కీపర్ ఉండగా.. మళ్లీ రిషబ్ పంత్ ను ఎందుకు తీసుకున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. సూర్యకుమార్ కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని కోహ్లీని తిట్టిపోస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కు గాయం కావడంతో ఆ ప్లేసులో సూర్య కుమార్ కు చాన్స్ వస్తుందని అంతా భావించారు. కానీ అతడిని కాకుండా రిషబ్ పంత్ ను తీసుకోవడం వివాదాస్పదం అయ్యింది.
సూర్యకుమార్ ను పక్కకు పెట్టెందుకు కోహ్లీయే ప్రధాన కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు..
అటు కోహ్లీని .. ఇటు బీసీసీఐ తీరును కూడా నెటిజన్లు తప్పుపడుతున్నారు. గత ఆస్ట్రేలియా టూర్ కు సూర్య కుమార్ ను ఎంపిక చేయకపోవడంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి.
దీంతో ఇటీవల ఐదు టీ20ల సిరీస్‌లో సెకండ్ మ్యాచ్‌లో సూర్యకు అవకాశం దక్కింది. ఆ తర్వాత మూడో టీ20కి రోహిత్ అందుబాటులోకి రావడంతో మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక నాలుగో టీ20కి ముందు ఇషాన్ కిషన్ గాయపడటంతో జట్టులోకి వచ్చాడు సూర్య. ఆ టైంలో వచ్చిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకున్నాడు.
వివాదాస్పద రీతిలో ఔటైనా 31 బంతుల్లో 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆఖరి టీ20లోనూ 32 కీలక పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. సూర్యకు వన్డే సీరిస్ లో అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ చాన్స్ రాలేదు.
శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటం.. భుజానికి సర్జరీ చేయాల్సి ఉండటంతో మిగిలిన మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ ఫస్టాఫ్ మ్యాచ్ లకు దూరంకానున్నాడు.
అయ్యర్ గైర్హాజరీతో సూర్యకు మార్గం సుగుమమైందని అంతా భావించారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అనూహ్యంగా పంత్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. దాంతో సూర్యకు మరో సారి నిరాశే ఎదురైంది.కేఎల్ రాహుల్ జట్టులో ఉండగా మరో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ అయిన రిషబ్ పంత్‌ను ఎందుకు తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(4), రోహిత్ శర్మ(25) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 44 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. మ్యాచ్ ఇంకా కొనసాగుతున్నది.