టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవలే కొంత మంది దాడికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. బుధవారం రోజు పృథ్వీ షా తన స్నేహితులతో కలిసి ముంబయిలోని శాంతా క్రూజ్ లోని ఓ ఫైవ్ స్టారో హోటల్ కు వెళ్లాడు. అయితే అక్కడ షాను చూసిన కొందరు... సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అయితే ఈ క్రమంలో పృథ్వీ ఇద్దరితో మాత్రమే సెళ్పీ దిగేందుకు ఆసక్తి చూపించాడు. మిగతా వారికి.. తాను స్నేహితులతో భోజనం చేసేందుకు వచ్చానని చెప్పగా.. పలువురు గొడవకు దిగారు.
దీంతో పృథ్వీ వారిపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీంతో హోటల్ సిబ్బంది సదరు గ్యాంగ్ ను బయటకు పంపించి వేశారు. ఇదంతా మనసులో పెట్టుకున్న వారు షా వెళ్లిపోతుండగా.. అతడిపై దాడి చేశారు.
కారు వెళ్లిపోతుంటే వెంట పడి మరీ కొట్టారు. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే షఆ స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సప్న గిల్ అనే ఓ యువతే ఇదంతా చేసిందని.. దాడి చేయడమే కాకుండా 50 ఇ్వవాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సురేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సప్న గిల్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న సప్న గిల్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కావడం గమనార్హం.
ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈమెకు 2 లక్షల 20 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. చంఢీఘడ్ కు చెందిన ఈమె ప్రస్తుతం ముంబయిలో నివసిస్తుంది. కేవలం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గానే కాకుండా.. రవి కిషన్, నిరాహువా వంటి స్టార్ నటులతో కూడా సప్న గిల్ భోజ్‌పురి చిత్రాల్లో నటించింది.
తమకు సెల్ఫీ ఇవ్వలేదన్న కోపంతో క్రికెటర్ పృథ్వీ షా కారుపై తన స్నేహితులతో కలసి దాడి చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు సప్న గిల్ తో పాటు శోభిత్ ఠాకుక్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఎనిమిది మందిపై కూడా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.