సంజూ శాంసన్ ఇకనైనా కళ్లు తెరవాలి..

Update: 2022-12-31 01:30 GMT
కేరళ సూపర్ స్టార్ సంజూ శాంసన్ కు టీ 20 జట్టులో చోటు దక్కింది. భారత్ తరుపున ఈ యంగ్ ఆటగాడు చివరిగా న్యూజిలాండ్ తో ఆడాడు. అయితే కివీస్ తో జరిగిన మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచులో మాత్రమే అవకాశం వచ్చింది. ఆ తరువాత బెంచ్ కే పరిమితం అయ్యాడు.  ఆ తరువాత పలు సిరీసులకు సంజూకు పిలుపు రాలేదు. రిషబ్ పంత్ గాయపడినా సంజూను ఆహ్వానించలేదు. కానీ ఇప్పుడు ఆయనను తీసుకోవడం అదృష్టమనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో సంజూ కాస్త జాగ్రత్తగా ఆడాలని సీనియర్ క్రీడాకారులు సూచిస్తున్నారు. తనకు ఇదే చివరి అవకాశం అన్నట్లుగా తొందరపడొద్దని అంటున్నారు.

సంజూ ఆల్ రౌండర్ ఆటగాడని కొందరు సీనియర్లు అంటున్నారు. ఆయన ఏ స్థానంలో ఉన్నా జట్టు కోసం సమర్థవంతంగా పనిచేయగలడని చెబుతున్నారు. అయితే ప్రదర్శనలో తొందరపాటు విడిచిపెట్టాలని ప్రముఖ క్రీడాకారుడు సంగక్కర సూచిస్తున్నారు.

మైదానంలో దిగినప్పుడు సంజూ ఆటను ఎంజాయ్ చేయాలి.. అంతేగానీ.. భారంగా ఫీలయితే మాత్రం రాణించలేవు  అని సూచించారు. మనం ఎలా ఆడామన్నది  ఇతరులు గమనించాలంటే అందుకు కాస్త ఓపిక ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఐపీఎల్ మ్యాచుల్లో సంజూ అదరగొట్టాడు. అయితే ఐపీఎల్ కు టీమిండియా జట్టుకు చాలా తేడా ఉంది. అక్కడ దూకుడు మాత్రమే పనికొస్తుంది. కానీ ఇక్కడ దేశంలోని క్రీడాభిమానులను మెప్పించే విధంగా ప్రదర్శించాలి. తన దృష్టిని మొత్తం బ్యాటింగ్ మీదనే ఉంచాలి.

ఎలాంటి వ్యాపకాలకు గురికావద్దు. భారత్ జట్టు తరుపున ఆడినప్పుడు ఇతర క్రీడాకారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి. మనకు ఎదురుగా వచ్చే బాల్ పైనే దృష్టిని కేంద్రీకరించారు. అప్పుడే జట్టుకు న్యాయం చేయగలుగుతాం.

ముఖ్యంగా సంజూ రిలాక్స్ మైండ్ ను అలవర్చుకోవాలి. కుర్రాడి మనస్తత్వం నుంచి బయటపడి బాధ్యతగా ఫీలవ్వాలి. మైదానంలో దిగినప్పుడు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా ఉండాలి. ఒక్కోసారి తన స్థానం ముందుకు రావొచ్చు.. చివరగా ఉండొచ్చు.. అలాంటి సమయంలో నిరాశ నిస్ప్రుహలకు లోనుకాకుండా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్లేస్ ఏదైనా ఆడగల సత్తా తనకు ఉందని నిరూపించుకోవాలి. ఇలాంటి విషయాలే క్రీడా భవిష్యత్ కు మార్గం చూపుతాయి.. అని సంజూకు సీనియర్లు సలహాలు ఇస్తున్నారు. మరి సంజూ తన ఆటతీరును ఎలా ప్రదర్శిస్తాడో చూడాలి..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News