క్రిమినల్ - లేడీ పోలీస్ ప్రేమ కథ..

Update: 2019-08-09 14:30 GMT
ప్రేమ గుడ్డిది అంటారు. ఎలా పుడుతుందో ఎప్పుడు పుడుతుందో తెలియదంటారు.. కత్తిలాంటి అమ్మాయిలు కరకుగా ఉండే అబ్బాయిలను ఇష్టపడుతుంటారు.. అందరూ వీళ్లను చూసి ముక్కున వేలేసుకుంటారు. అమ్మాయిలకు టేస్ట్ లేదంటూ కామెంట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ కూడా ఓ మహిళా పోలీస్ అధికారి ప్రేమలో పడింది.కానీ ఆ లవర్ ఓ కరుడుగట్టిన నేరస్థుడు. పైగా గ్యాంగ్ స్టర్. హత్యలు, దోపిడీలు చేసిన ఘనుడు.. అతడిని చూసి ప్రేమలో పడి ఏకంగా పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమ, పెళ్లి కథ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సినిమా రీల్ ను తలదన్నే రియల్ లవ్ స్టోరీ ఆసక్తి రేపుతోంది.

యూపీకి చెందిన పాయల్ అనే పోలీస్ అధికారి గ్యాంగ్ స్టార్ రాహుల్ థారసన ప్రేమలో పడింది. వీరిద్దరూ మొదటి కలిసింది కోర్టులో.. నేరస్థులను కోర్టులో ప్రవేశపెట్టడానికి పోలీస్ పాయల్ వచ్చింది. అక్కడే  కోర్టుకు విచారణకు హాజరైన రాహుల్ ను తొలిసారి పాయల్ చూసింది. తొలిచూపులోనే ప్రేమలో పడింది. మనసు ఇచ్చేసింది.

2014 మే 9న మన్మోహన్ గోయల్ అనే వ్యాపారి హత్య కేసులో రాహుల్ ను తొలిసారి పోలీసులు పట్టుకొని కోర్టుకు తీసుకొచ్చారు. అప్పుడే అతడిని చూసిన మహిళా పోలీస్ పాయల్  అతడి మాట్లాడడం.. మనసులు కలవడం.. మనసు ఇచ్చి పుచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి.

రాహుల్ హత్యలు, దోపిడీలు చేసి బయట ఉన్నా.. జైలులో ఉన్నా అతడితో పాయల్ మాట్లాడుతూనే ఉండేది. ప్రేమలో మునిగి తేలుతూనే ఉంది. అయితే ఇటీవలే పాయల్-రాహుల్ పెళ్లి చేసుకున్నారు. ఇదీ అత్యంత గోప్యంగా.. పోలీస్ శాఖకు తెలిస్తే తన ఉద్యోగం పోతుందని తెలిసి చెప్పకుండా సీక్రెట్ గా ఉంది. అయితే గ్యాంగ్ స్టర్ రాహుల్  మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది.  ఓ పోలీస్ గ్యాగ్ స్టర్ ను పెళ్లి చేసుకుందనే వార్త యూపీ పోలీస్ శాఖలో కలకలం రేపింది.

హత్యలు చేసిన గ్యాంగ్ స్టార్ ను పెళ్లి చేసుకోవడంపై యూపీ పోలీసులు విచారణ జరిపారు. పాయల్ ప్రస్తుత గౌతమ్ బుద్ధ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తోందని తెలిసింది. ఈ వివాహంపై ఆరాతీస్తున్నామని  నోయిడా రూరల్ ఎస్పీ రన్ విజయ్ సింగ్ పేర్కొన్నారు.
Tags:    

Similar News