సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలపై కేసులు పెట్టటం మామూలే. అయితే.. ఆర్మీ రియాక్ట్ అయి ఒక మహిళా విద్యార్థి నేతపై కేసు పెట్టటం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు. కశ్మీర్ అంశంపై తాజాగా కశ్మీరీ మహిళా విద్యార్థి నేత.. జేఎన్ యూ విద్యార్థి నాయకులురాలైన షెహ్లా రషీద్ తాజాగా ట్వీట్లు చేయటం తెలిసిందే.
కశ్మీర్ లో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందన్న విషయాన్ని ఆమె చెబుతూ.. పెద్ద ఎత్తున చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి. ఆర్మీపై ఆమె పలు ఆరోపణలు చేశారు. కశ్మీరీ పోలీసులకు ఎలాంటి ఆయుధాల్ని ఇవ్వటం లేదని.. వారి చేతికి ఉత్త లాఠీలు మాత్రమే ఇస్తున్నట్లుగా ఆరోపించారు. రాత్రి వేళ.. కశ్మీర్ లోని పలువురు యువకుల్ని ఆర్మీ సిబ్బంది ఇళ్లల్లోకి జొరబడి అదుపులోకి తీసుకుంటున్నారని.. పరిస్థితి భయానకంగా ఉందంటూ పోస్టులు పెట్టారు.
ఆమె పోస్టులు సంచలనంగా మారిన నేపథ్యంలో భారత ఆర్మీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలు అర్థరహితమని.. కశ్మీర్ లో పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని స్పష్టం చేసింది. షెహ్లా వ్యాఖ్యల్ని తాము పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. భారత ఆర్మీపై ఆమె చేసిన పోస్టు వివాదంగా మారటంతో ప్రముఖ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ సుప్రీంలో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఆర్మీపై ఆమె సత్యదూరమైన ఆరోపణలు చేశారని.. ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి.. సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.