శబరిమల పూజారులపై క్రిమినల్‌ కేసు..?

Update: 2019-01-02 15:59 GMT
శబరిమల ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. అయితే.. ఈ నిషేధం రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాల రాయడమేనని సుప్రీం తీర్పునిచ్చింది. దీంతో.. ఇద్దరు మహిళలు స్వామివారి దర్శనం చేసుకునేందుకు కేరళ సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే.. ఈ విషయం ఆలయ అర్చకులకు తెలీదు. విషయం తెలుసుకున్న శబరిమల పూజారులు.. అపచారం జరిగిందంటూ కాసేపు ఆలయాన్ని మూసివేశారు. ఆ తర్వాత శుద్ధి చేసి భక్తులను అనుమతించారు.

రాజ్యాంగం ప్రకారం.. అన్ని వయస్కుల మహిళల్ని అలయంలోకి అనుమతించక పోవడం అంటరానితనమే కిందకే వస్తుంది. అదీగాక అపచారం జరిగింది అంటూ శుద్ధి చేయడం కూడా అంటరానితనమే. ఈ విషయంలో దేశంలో అన్ని రకాల అంటరానితనాలను నిషేధిస్తున్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17ని ధిక్కరించడమే. అన్ని వయస్కుల మహిళల్ని ఆలయంలోకి అనుమతించాలి అని సుప్రీంకోర్టు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తో కూడిన బెంచి గత సెప్టెంబర్‌ 28న ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటప్పుడు.. ఆర్టికల్‌ 17ని శబరిమల పూజారులు ధిక్కరించినట్లే. మరి ఇప్పుడు శబరిమల పూజారులపై విజయన్‌ సర్కార్‌ కేసులు పెడుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. శుద్ధిపూజల పేరిట ఆలయాన్ని కాసేపు మూసివేసిన పూజారులపై చర్యలు తీసుకుంటామని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ప్రకటించింది.

Full View

Tags:    

Similar News