`ఎయిడెడ్‌`పై జ‌గ‌న్ మ‌డ‌మ ఎందుకు తిరిగింది?

Update: 2021-10-26 09:30 GMT
రాష్ట్రంలో ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్న విష‌యం.. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌ను ప్ర‌భుత్వం స్వాధీ నం చేసుకోవ‌డం. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. ప్ర‌భుత్వ సాయంతో ప‌నిచేస్తున్న విద్యాసంస్థ‌లు.. అవి స్కూళ్లు కావొ చ్చు.. కాలేజీలు కావొచ్చు.. ఏవైనా స‌రే.. వాటిని స‌ర్కారు త‌న ఖాతాలోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిం చింది. దీనికి సంబందించి జీవోలు కూడా విడుద‌ల చేసింది. దీనికి కార‌ణం ఏం చెప్పిందం టే.. ప్ర‌భు త్వం నుంచి అన్ని రూపాల్లోనూ సాయం పొందుతున్న సంస్థ‌లు.. విద్యార్థుల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డంలో ను.. నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంలోనూ విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని.. అందుకే వాటిని తామే తీసుకుని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించామ‌ని చెబుతోంది.

అయితే.. ఇలా ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌ను తీసుకుంటున్న ప్ర‌భుత్వంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ సంస్థ‌ల‌కు భారీ మొత్తంగా స్థ‌లాలు.. ఆస్తులు ఉన్నాయి. వీటిపై ప్ర‌భుత్వం క‌న్నేసింద‌ని.. వీటిని కూడా కుదిరితే.. అమ్మేయ‌డ‌మో.. లేక తాక‌ట్టు పెట్ట‌డ‌మో చేయాల‌ని నిర్ణ‌యించుకుంద‌ని.. అందుకే ఇలా ఎయి డెడ్ విద్యా సంస్థ‌ల‌ను తీసుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై కొన్ని సంస్థ‌లు హైకోర్టును ఆశ్ర‌యిం చాయి. అయితే.. ఈ కేసు విచార‌ణ ద‌శ‌లోనే ఉంది. బ‌లంవంతం చేయ‌రాద‌ని.. మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సంస్థ‌ల‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది.

ఇక‌, ఇది రాజ‌కీయంగా తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులుసంస్థ‌లు పెట్టి ఎయిడెడ్ విద్యాసంస్థ‌లు న‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయంగా అలాంటివారికి ఇబ్బందిగా మారింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై ఒత్తిళ్లు పెరిగాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొన్నాళ్ల కింద‌టే ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల‌ను బ‌ల‌వంతంగా తాము తీసుకునేది లేద‌ని.. స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. మౌలిక స‌దుపాయాలు మెరుగు ప‌రుచుకుంటే.. కొన‌సాగించుకోవ‌చ్చ‌ని.. నాణ్య‌మైన విద్య‌ను విద్యార్థుల‌కు అందించాల‌నేదే.. త‌మ ఉద్దేశ‌మ‌ని.. చెబుతోంది.

ఇదే విష‌యాన్ని తాజాగా మరోసారి సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. కానీ, ఎయిడెడ్ సంస్థ‌ల‌ను ప్ర‌భుత్వం తీసుకుంటే.. కనుక పేద‌వ‌ర్గాల‌కు చెందిన విద్యార్థులు.. ఇబ్బందులు ప‌డ‌తార‌ని.. విద్యార్థుల త‌ల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదే విష‌యంపై విశాఖ‌లో త‌ల్లిదండ్రులు.. విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉచితంగాను.. లేదా.. స్ప‌ల్ప ఫీజుల‌తో విద్య‌ను అందించిన సంస్థ‌ల‌ను మూసేయ‌డం స‌రికాద‌ని వారు తెలిపారు. అమ్మ ఒడి ప‌థ‌కం కింద ఏటా 15 వేలు ఎవ‌రు ఇమ్మ‌న్నార‌ని కూడా వారు ప్ర‌శ్నించారు. ఇలా.. అన్ని వైపుల నుంచి ప్ర‌భుత్వానికి ఆది నుంచి సెగ త‌గులుతుండ‌డంతో సీఎం జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గుతున్నార‌ల‌నే వాద‌న వ‌స్తోంది.
Tags:    

Similar News