విశేషమైన ఐపీఎల్ అనుభవంతో.. అపారమైన వనరులతో.. ఫేవరెట్ గా టి20 ప్రపంచకప్ లో అడుగుపెట్టని టీమిండియా దారుణ పరాజయాలతో అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఎంతో కష్టమైనదైనప్పటికీ, పాకిస్థాన్ పై ఓటమిని జీర్ణించుకున్న అభిమానులు.. కీలకమైన న్యూజిలాండ్ తో పోరులోనూ 110 పరుగులే చేసి.. ఆపై ప్రత్యర్థని కట్టడి చేయలేక చేతులెత్తేయడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎత్తిపొడుపులకు దిగుతున్నారు. సందర్భం ఎలాంటిదైనా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు హాస్యం, వ్యంగ్యం జోడించి వదిలే సోషల్ మీడియా సెటైర్లు అందరినీ అలరిస్తాయనడంలో సందేహం లేదు. ఇప్పడు అలాంటి సందర్భమే రావడంతో అభిమానులు మరో విధంగా పండుగ చేసుకుంటున్నారు. అదెలాగంటే.. దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరు 115 రూపాయిలు దాటింది. పన్నులు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రంలో లీటరు ఏకంగా రూ.120కి చేరింది.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పై ఆదివారం మ్యాచ్ లో టీమిండియా స్కోరు 110ని, దేశంలో పెట్రోల్ రేటు 115ను పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వదులుతున్నారు. వంద మీటర్ల పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ ను దూసుకెళ్తోన్న పెట్రోల్ రేటు రూ.115తో పోలుస్తూ.. ఆ వెనుక 110 అంకెతో టీమిండియా ఉన్నట్టు విడుదల చేసిన ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇలాంటివే మరికొన్ని చిత్రాలు కూడా సోషల్ మీడియాలో అలరిస్తున్నాయి. ఐపీఎల్ లో పులులు, సింహాల తరహాలో రెచ్చిపోయే భారత క్రికెటర్లు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్న తీరును పోల్చుతూ పెడుతున్న ఫొటోలు ఆలోచింపజేస్తున్నాయి.
నెట్ రన్ రేట్ ను పెంచుకునేందుకు మిగతా జట్లు భారత్ తో మ్యాచ్ ఆడేందుకు ఎగబడుతున్నట్లు, ఐపీఎల్ లో పూర్తి అంకితభావంతో (రెండు కళ్లప్పగించి చూస్తున్న షారూఖ్ ఖాన్ ఫొటొ జోడించి) ఆడే భారత క్రికెటర్లు.. వరల్డ్ కప్ నకు వచ్చేసరికి నిద్రపోతున్నట్టున్న మీమ్స్ సూటిగా ప్నశ్నించేలా ఉన్నాయి. ఐపీఎల్ లో సిక్స్ ప్యాక్ తో హీరోలా కనిపించే టీమిండియా ఆటగాళ్లు.. వరల్డ్ కప్ లో బక్క పల్చని పిల్లాడిలా మారారంటూ పోస్ట్ చేసిన మరో
ఫొటో పరిస్థితిని ప్రతిబింబించేలా ఉంది. ఇక మిగతా జట్లు సెమీఫైనల్స్ కు క్వాలిఫై అయ్యేందుకు పోటీ పడుతుంటే.. కోహ్లి సేన మాత్రం ముంబై విమానాశ్రయంలో దిగేందుకు క్వాలిఫై కావడంలో పోటీ పడుతోందని వ్యంగ్యంగా మరో పోస్ట్ ను పెట్టడం గమనార్హం. అంతేకాక.. మనం గెలిస్తే భారత్ లో దీపావళి సందర్భంగా మరిన్ని పటాసులు కాలుస్తారని, తద్వారా కాలుష్యం మరింత పెరుగుతుందని.. కాబట్టి దానిని నివారించేందుకు మనం అసలు గెలవకూడదని సహచరులతో కెప్టెన్ కోహ్లి చెబుతున్నట్లున్న మీమ్ అన్నిట్లోకి హైలైట్ గా నిలిచింది.