పురానాపూల్ మూసీ ఒడ్డున కలకలం సృష్టించిన మొసలి !

Update: 2020-09-17 16:30 GMT
హైదరాబాద్ ‌లో బుధవారం సాయంత్రం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి చాలా చోట్ల రోడ్లన్నీ నదులను తలపించాయి. నగరంలో ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. వరద ఉధృతికి వాహనాలు సైతం నీళ్లలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే అఫ్జల్ గంజ్ సమీపంలోని పురానా పూల్ బ్రిడ్జి వద్ద మొసలి కలకలం రేపింది. నదిలో నుంచి ఒడ్డుకు వచ్చిన మొసలి చాలా సేపు అలాగే కదలకుండా అక్కడే ఉన్నది. దాన్ని చూసి సమీప ప్రాంతాలవారు భయపడ్డారు. బుధవారం నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదకు మొసలి అక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

అక్కడే , మొసలి కదలికలు కనిపించడంతో వారు తీవ్ర భయాందోళన గురైయ్యారు. దీనితో వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు, జంతు ప్రదర్శనశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. జూ సిబ్బంది పురానాపూల్ వంతెన వద్దకు చేరుకొని మొసలిని పట్టుకొని తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే అది నీటిలోకి వెళ్లిపోయింది. దీనితో దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News