స్వదేశంలో విదేశాన్ని.. అందునా ప్రత్యర్థిని పొగిడేసే దరిద్రపుగొట్టు జనాలు కొందరు మన దేశంలోనే కనిపిస్తారు. దేశం ఏదైనా.. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి వణికిపోతారు. అదేం దరిద్రమో కానీ.. మన దేశంలో మాత్రం నేతలు ఇష్టారాజ్యంగా విమర్శలు చేసేస్తుంటారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. కోట్లాదిమంది ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో సెక్యూరిటీ తీసుకుంటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి వారిని ఏం చేయాలా? అన్న కోపం కొన్నిసార్లు చాలా బలంగా కలుగుతుంటుంది. తాజాగా అలా మండిపోయే మాటను మాట్లాడాడు.
ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ లో భారత్ పై పాక్ విజయాన్ని ఉద్దేశించి కాశ్మీరీ వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ ట్వీట్ చేస్తూ.. నలువైపులా పటాకులు పేలుతున్నాయని.. ఈద్ ముందుగానే వచ్చినట్లుందన్నాడు. అత్యుత్తమ జట్టు విజయం సాధించిందని.. పాకిస్థాన్ టీంకు శుభాకాంక్షలని పేర్కొన్నాడు.
ఇలా ట్వీట్ చేసిన మిర్వాయిజ్ వ్యాఖ్యపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మిర్వాయిజ్ కు తానో సలహా ఇవ్వాలనుకున్నట్లుగా చెబుతూ.. "ఇంకా మీరు సరిహద్దులు దాటి పాక్ కు ఎందుకు వెళ్లిపోవటం లేదు? మీకు అక్కడ నుంచి చైనా టపాసులు దొరుకుతాయి. అక్కడికి వెళ్లి ఈద్ చేసుకోండి. మీ సామానులు ప్యాక్ చేసేందుకు సాయం చేస్తాను" అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటమితో తీవ్ర నిరాశతో ఉన్న ప్రజలకు మంట పుట్టేలా మాట్లాడే మిర్వాయిజ్ లాంటి నేతకు ఇలాంటి ఘాటు పంచ్ ఇవ్వడంలో తప్పులేదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/