ప్ర‌గ‌తి నివేద‌న‌కు జ‌న ప్ర‌భంజ‌నం ఎంత‌?

Update: 2018-09-03 05:23 GMT
దేశ చ‌రిత్ర‌లో క‌నివిని ఎరుగ‌ని రీతిలో ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌మ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాలు.. ప‌థ‌కాల గురించి చెప్ప‌టంతో పాటు.. ముంద‌స్తుకు వెళ్లిన ప‌క్షంలో త‌న స‌త్తా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌న్న విష‌యాన్ని కేసీఆర్ చేశార‌ని చెప్పాలి.

మ‌రి.. ఇంత‌టి కీల‌క‌మైన స‌భా నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను అప్ప‌జెప్పిన కేటీఆర్ కానీ.. స‌భ ఏర్పాటు వెనుకున్న మాస్ట‌ర్ మైండ్ కేసీఆర్ కానీ స‌భ‌కు వ‌చ్చిన వారి సంఖ్య‌ను పేర్కొన‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అనుకున్న‌ట్లే పాతిక ల‌క్ష‌ల మంది కాదు.. క‌నీసం 20 ల‌క్ష‌ల మంది వ‌చ్చినా లెక్క‌ల్లోకి పాతిక ల‌క్ష‌లు అన్న మాట వ‌చ్చేద‌ని చెబుతున్నారు. కానీ.. అలాంటిదేమీ లేక‌పోవ‌టంతో జ‌న‌సందోహం భారీగా వ‌చ్చింద‌ని.. కొంగ‌ర‌కు వ‌చ్చే నాలుగు దారుల్లోనూ భారీ ఎత్తున వాహ‌నాలు నిలిచిపోయాన‌ని.. దీంతో బ‌హిరంగ స‌భ కొంత కిక్కు మిస్ అయ్యింద‌న్న మాట వినిపిస్తోంది.

అస‌లు ప్ర‌గ‌తి నివేదన స‌భ‌కు వ‌చ్చినోళ్లు ఎంత మంది ఉంటార‌న్న ప్ర‌శ్న ప‌లువురి నోట రావ‌టం వెనుక క‌చ్ఛితంగా కేసీఆరే కార‌ణంగా చెప్పాలి. పాతిక ల‌క్ష‌ల మందితో స‌భ‌ను నిర్వ‌హించాల‌న్న‌ది కేసీఆర్ ఆకాంక్ష‌. ఆ విష‌యాన్ని ఇప్ప‌టికే ఆయ‌న చెప్పేశారు. కానీ.. స‌భ‌కు ఆశించిత‌నంతగా స‌భికులు రాలేద‌న్న మాట  తెర పైకి వ‌చ్చింది.

పార్టీ వ‌ర్గాల మాట ప్ర‌కారం.. సాయంత్రం ఆరు గంట‌ల నాటికి స‌భా ప్రాంగ‌ణంలోకి ఏడు ల‌క్ష‌ల‌కు మించి స‌భికులు లేర‌న్న మాట చెబుతున్నారు. ఇదే స‌భ‌లో మాట్లాడిన కేసీఆర్.. త‌న ప్ర‌సంగం చివ‌ర్లో స‌భ కోసం వ‌చ్చిన వారిలో భారీ ఎత్తున వాహ‌నాలు ర‌హ‌దారి మ‌ధ్య‌లోనే ఆగిపోయిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

కేసీఆర్ మాట‌ల్ని జ‌న‌స‌మీక‌ర‌ణ లెక్క‌ల్లోకి తీసుకెళితే.. స‌భా ప్రాంగ‌ణానికి ఏడెనిమిది ల‌క్ష‌లు వ‌చ్చి ఉంటే.. స‌భ‌కు చేరుకోలేక నేష‌న‌ల్ హైవేల మీద‌నే చిక్కుకు పోయిన వారి సంఖ్య త‌క్కువ‌లో త‌క్కువ మూడు ల‌క్ష‌లు ఉండొచ్చు. స‌రే.. మ‌రో ల‌చ్చ‌ను క‌లిపి నాలుగు ల‌క్ష‌లుగా వేసుకుంటే.. మొత్తంగా 11 ల‌క్ష‌ల మాత్ర‌మే తేలిన‌ట్లైంది. వాస్త‌వానికి ఒక బ‌హిరంగ స‌భ‌కు 11 ల‌క్ష‌ల మందిని స‌భ‌కు వ‌చ్చేలా చేయ‌టం అంటే మాట‌లు కాదు. కాకుంటే.. కేసీఆర్ చెప్పిన పాతిక  ల‌క్ష‌ల ప్ర‌తి క్ష‌ణం గుర్తుకు తెచ్చేలా ఉండ‌టంతో ప్ర‌జ‌లంతా పాతిక ల‌క్ష‌ల మైండ్ సెట్ తో ఉండిపోయారు. చివ‌ర‌కు త‌స్సుమ‌నిపించేలా జ‌న స‌మీక‌ర‌ణ సాగిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదంతా పాతిక‌ల‌క్ష‌ల మంది స‌భ‌కు హాజ‌రు ఆయ్యే లెక్క‌లో చూసిన‌ప్పుడు స‌భ కు రావాల్సినంత మంది జ‌నం రాలేద‌న్న‌ట్లుగా ఉంటుంది. కానీ.. వ‌చ్చిన ల‌క్ష‌లాది మంది లెక్క‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మాత్రం రికార్డు స‌భ‌గా చెప్పాలి. అంచ‌నాలు ఎక్క‌వై.. అనుకున్న దానికి భిన్న‌మైన ఫ‌లితం వ‌చ్చిన‌ప్పుడు సాధించిన విజ‌యం చిన్న‌దిగా క‌నిపించ‌టం మామూలే. కొంగ‌ర క‌లాన్ లో నిర్వ‌హించిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భలోనూ ఇదే  జ‌రిగింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News