పెద్ద పెద్ద ప్రమాదాలకు చిన్న చిన్న కారణాలేనని చెబుతుంటారు. ఆ మాటలో నిజం ఎంతన్నది తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి ఎల్ఫిన్ స్టన్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 23 మంది అమాయక ప్రాణాలు పోవటం తెలిసిందే.
ఇంతకీ ఈ ఘోరం ఎలా చోటు చేసుకుంది? అంతమంది ప్రాణాలు పోవటానికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఒక బాధితురాలి చెప్పిన మాట వింటే అవాక్కు అవ్వాల్సిందే. మాటలో వచ్చిన చిన్న తేడా.. దాన్ని అర్థం చేసుకోవటంలో దొర్లిన పొరపాటుకు 23 నిండుప్రాణాలు బలి అయ్యాయంటే నమ్మక తప్పదు.
పువ్వులు (ఫూల్) పడిపోయాయి అన్న మాటను పూల్ (వంతెన) పడిపోయిందని అర్థం చేసుకోవటం ఏర్పడిన గందరగోళం.. ఆపై చోటు చేసుకున్న తొక్కిసలాటకు కారణమైందన్న విషయాన్ని ఈ ఉదంతంలో ప్రాణాలతో బయటపడిన యువతి ఒకరు వెల్లడించారు. తొక్కిసలాట రోజు ఏం జరిగిందన్న విషయాన్ని వివరించిన ఒక యువతి.. బ్రిడ్జి పక్కనే ఉన్న పూలు అమ్ముకునే వ్యక్తి పూలు పడిపోయాయి (ఫూల్ గిర్ గయా) అంటూ ఏడుస్తూ చెప్పిన మాటను.. అక్కడి వారు తప్పుగా పూల్ (వంతెన) గిర్ గయా అని అర్థం చేసుకోవటంతో.. ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఇదికాస్తా తొక్కిసలాటకు దారి తీసి భారీ ప్రాణనష్టానికి కారణమైంది. మాటలో దొర్లిన చిన్న తప్పు అంతమంది ప్రాణాలు పోయేలా చేసిందని చెప్పక తప్పదు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థిని సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించటం చూసినప్పుడు నోటి నుంచి వచ్చే మాటను మరింత ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాలనిపించక మానదు.