క్రిప్టో కరెన్సీ..కొన్నాళ్లుగా దేశంలో చర్చకు వస్తున్న డిజిటల్ కరెన్సీ. అయితే.. దీనిలో పెట్టుబడులు పెడితే.. భారీ ఎత్తున లాభాలు వస్తాయని.. భావించి.. అనేక మంది దీనిలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే..ఒక్కొక్క సారి ఇవి.. తీవ్ర నష్టాన్నే మిగుల్చుతున్నాయి. ఇలా.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి.. రూ.70 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ సొమ్ములో చాలా మటుకు ఆయన అప్పులుగా తెచ్చారు. ఈ నేపథ్యంలో అప్పుల వాళ్ల నుంచి పెరిగిన ఒత్తిడి కారణంగా.. ఆయన చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పోలీసుల కథనం మేరకు.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన జీ. రామలింగస్వామి(36) తన ఇద్దరు స్నేహితులతో కలిసి.. ఆన్ లైన్ క్రిప్టో కరెన్సీ యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. తొలుత 10 లక్షల రూపాయలతో ప్రారంభమైన ఈ వ్యాపారం.. తొలినాళ్లలోబాగానే నడిచింది. మొదటి నెలల్లో లాభాలు వచ్చాయి. దీంతో మరింతగా తమ పెట్టుబడులను పెంచారు. ఈ క్రమంలో రామలింగస్వామి ఒక్కరే.. 70 లక్షల వరకు పోగొట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఈ నిధులను ఆయన.. అప్పులుగా తెచ్చినవేనని గుర్తించారు.
స్వామికి అప్పులు ఇచ్చినవారు.. ఇటీవల కాలంలో ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయ న కారును తీసుకువెళ్లడంతోపాటు.. కొన్ని చెక్కులపై సంతకాలు కూడా చేయించుకున్నారు. ఒకవైపు డబ్బులు నష్టపోయి.. మరోవైపు.. అవమానాలు భరించాల్సి రావడంతో స్వామి నిలువెల్లా కుంగిపోయారు. ఈ క్రమంలో ఆయన వీటిని ఇక, తాను భరించలేనని భావించి.. నవంబరు 22న సూర్యాపేటలోని ఒక లాడ్జిలో దిగి.. విష రసాయనం తాగి ఆత్మహత్యకు ఒడిగట్టారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. స్వామి నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. అయితే.. క్రిప్టోలో నష్టాలు, లాభాలు సహజమేనని.. కొంత ఓర్పు పట్టి ఉంటే.. ఆయన అప్పుల నుంచిబయటపడేవారని అంటున్నారు. సూసైడ్ నోట్‌లో తన భార్యను ఉద్దేశించి.. స్వామి కొన్ని విషయాలను ప్రస్తావించినట్టు పోలీసులు తెలిపారు.