తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అని ప్రసారమాధ్యమాల్లో ప్రసారం అవుతుంది. తనకు కరోనా వైరస్ సోకినట్లు సీఎస్ స్వయంగా వెల్లడించారు. అయితే, ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు.ఇటీవల సీఎస్ సోమేశ్ కుమార్ కరోనా వైరస్ సహా, వివిధ రంగాలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ సమీక్షల్లో కొన్నింటిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎస్ కు పాజిటివ్ అని నిర్ధారణ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తనను ప్రత్యక్షంగా కలిసిన వారంతా ఐసోలేషన్‌లో ఉండి కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎస్ కోరారు. ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం సీఎం కేసీఆర్ తో సోమేష్ కుమార్ సమావేశమైయ్యారు. ఏప్రిల్ 3న కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ కూడా వారితోపాటే ఉన్నారు. అంతేకాక, వారికి అతి దగ్గరలోనే ఉండి ఫోటోలు కూడా దిగారు. ఇదే కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎన్సీ రవీందర్ రావు తదితరులు కూడా పాల్గొన్నారు.
అయితే.. తెలంగాణలో కరోనా టెన్షన్ పెడుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలకు పూనుకుంది. బహిరంగ ప్రదేశాలు, వర్క్ ప్లేసెస్ లో మాస్క్ తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాలపై నిషేధించింది. ర్యాలీలు, యాత్రలను బ్యాన్ చేసిన ప్రభుత్వం.. పండుగలపై కూడా ఆంక్షలు విధించింది. హోలీ, శ్రీరామనవమి వేడుకల్లో గూమిగూడొద్దని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 1,498 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ లో తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. కొత్తగా 245 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇవాళ నమోదైన కేసులతో క్రియాశీల కేసులు 10వేలకు చేరువయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,993 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. 5,323 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. నిన్న ఒకే రోజు 62,350 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.