శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. ఇదిలా ఉంటే శ్రీరాముడి ఫోటోలు కలిగిన కరెన్సీ నోట్లు కొన్ని దేశాల్లో ఇంకా మర్కెట్స్ లో ఉన్నాయి. వాటితోనే వారు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. శ్రీరాముడి కరెన్సీ న అదేంటి నిజమేనా ? అనుకుంటున్నారా అక్షరాల నిజం. రాముడి ప్రతిమ కలిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఉండటమే కాదు.. అవి చెల్లుబాటు కూడా అవుతున్నాయి.
ఇంతకీ ఆ నోట్లు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తున్నారా ? మన దేశంలో అయితే కాదు. అగ్రరాజ్యం అమెరికా, నెదర్లాండ్స్ లోని పలు ప్రాంతాల్లో రాముడి కరెన్సీ నోట్లు ఉన్నాయి. అయితే ఈ కరెన్సీ నోట్లకు చట్టబద్దత లేదు. అంటే అక్కడి ప్రభుత్వాలు ఈ నోట్లను అంగీకరించవు. కేవలం కొంత మంది మాత్రమే శ్రీరాముడి కరెన్సీ నోట్లతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని లోవా ప్రాంతంలో ఉన్న మహర్షి వేదిక్ సిటీ, నెదర్లాండ్స్ లో కొన్ని చోట్ల మాత్రమే రాముడి నోట్లతో లావాదేవీలు నిర్వహిస్తారు.
మహర్షి మహేశ్ యోగికి చెందిన గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ అనే ఒక ఆర్గనైజేషన్ 2002లో ఈ కరెన్సీ నోట్లను ఆ ప్రాంతాల్లో అందరికీ పంచింది. ఒక రామ నోటు విలువ 10 డాలర్లు. ఇలా మూడు రకాల నోట్లు ముద్రించారు. 1 రామ, 5 రామ, 10 రామ అనేవి నోట్లు. వీటిని అక్కడి ప్రజలు మాత్రమే ఉపయోగిస్తారు. బయటికి వెళ్లేటప్పుడు రామ నోట్లకు సమానమైన విలువ కలిగిన కరెన్సీ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకెళ్తారు. మహర్షి మహేశ్ యోగి మరణించిన తర్వాత 2008 రామ నోట్ల గురించి ప్రస్థావన లేదు. అయితే ఇప్పటికీ కూడా అక్కడ వీటిని ఉపయోగిస్తున్నారనే అంచనాలు ఉన్నాయి.