ఎంత చదవి ఏం లాభం.. ఎంత తెలివి ఉండి ఏం ప్రయోజనం.. అమెరికాలో ఉన్న ఎన్నా రై కూడా సైబర్ మోసగాళ్ల బారిన పడి నిండా మునిగాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఎనిమిదిన్నర లక్షలు కోల్పోయాడు. తర్వాత తెలుసుకొని లబోదిబోమన్నాడు. అమెరికా నుంచి వచ్చిన యువకుడు ఇలా మోసపోయిన వైనం చూసి పోలీసులే విస్తుపోతున్నారు.
బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక హైదరాబాద్ యువకుడు తాజాగా అమ్మానాన్నలను చూసేందుకు భారత్ కు వచ్చాడు. ఆన్ లైన్ మోసానికి బలయ్యాడు. డబ్బులన్నీ పోగొట్టుకొని నిండా మునిగాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఆన్ లైన్ మోసం.
హైదరాబాద్ లోని మెహదీపట్నంలో నివసిస్తున్న ఓ వ్యక్తి మొబైల్ కు ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. కరెంట్ బిల్లు కట్టలేదని.. అర్జెంట్ గా కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని ఆ మెసేజ్ సారాంశం. నిజంగానే ఆ వ్యక్తి కరెంట్ బిల్లు కట్టకపోవడంతో కాస్త ఆందోళన చెందాడు.
అప్పుడే అమెరికా నుంచి వచ్చిన తన కొడుక్కి ఆ మెసేజ్ చూపించాడు. మెసేజ్ చూసిన అమెరికా కొడుకు అందులో ఉన్న నంబర్ కు కాల్ చేశాడు. లింక్ పంపిస్తాం పేమెంట్ చేయమని వాళ్లు చెప్పారు. లింక్ రాగానే మనోడు దాన్ని క్లిక్ చేసి పేమెంట్ ఓకే చేశాడు. ఓటీపీ రావడంతో దాన్ని అవతలి వాళ్లకు చెప్పాడు.
అంతే క్షణాల్లో అతడి అకౌంట్ నుంచి ఏకంగా రూ.8.50లక్షలు మాయం అయ్యాయి. అకౌంట్ నుంచి ఏకంగా ఎనిమిదిన్నర లక్షలు మాయం కావడంతో అమెరికా కొడుకు, ఆయన తండ్రి లబోదిబోమన్నాడు. అకౌంట్ లోని మొత్తం సైబర్ నేరగాళ్లు కొట్టేయడంతో తండ్రీకొడుకులు వెంటనే ఆ ఫోన్ కు కాల్ చేశారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
కరెంట్ బిల్లు కట్టమని ట్రాన్స్ కో నుంచి ఎలాంటి ఫోన్స్ రావని పోలీసులు తెలిపారు. ఆ డిపార్ట్ మెంట్ వారు అసలు ఫోన్స్ చేయరని.. అనవసరంగా చేసి మోసపోయారని తెలిపారు.