అమాయకత్వం.. ఆశ.. అత్యాశ.. అవగాహనరాహిత్యం.. బలహీనతలు.. కారణం ఏదైనా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తాజాగా విడుదలైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి నుంచి సైబర్ నేరగాళ్లు దోచేసిన మొత్తం.. అధికారిక లెక్కలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. అంత భారీగా మోసపోయిన పరిస్థితి.
దీనికి సంబంధించిన గణాంకాల్ని జాతీయ సైబర్ నేరాల పోర్టల్ వెల్లడించింది. 2021 జులై 16 నుంచి 2023 జూన్ 12 వరకు తెలంగాణ వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు దోచేసిన మొత్తం రూ.587.59 కోట్లుగా తేల్చారు. ఇదంతా కూడా అధికారికంగా నమోదైన ఫిర్యాదుల ఆధారంగా లెక్కేసిన మొత్తం.
వాస్తవంగా దీనికి మించి భారీగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే.. సైబర్ నేరగాళ్ల బారిన పడి.. కంప్లైంట్ చేయటం ఎలానో తెలీక కొందరు.. కొందరు తెలిసినా తమ వివరాల్ని వెల్లడించేందుకు ఆసక్తిలేక మరికొందరు మౌనంగా ఉండిపోతున్నారు. వారి మొత్తాల్ని కలిపితే మరింత భారీగా ఉండే వీలుంది.
గడిచిన రెండేళ్లలో 1.27 లక్షల ఫిర్యాదులు అందినట్లుగా చెబుతున్నారు సైబర్ నేరాలపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన పోర్టల్ కు తెలంగాణలో రోజూ 700ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇందులో 250 కొత్త ఫిర్యాదులు ఉంటే.. మిగిలినవి తమ కేసులకు సంబంధించిన డెవలప్ మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అన్న విషయాన్ని తెలుసు కోవటానికి ఫోన్ చేస్తున్న వారు ఉన్నారు.
జాతీయ సైబర్ నేరాల పోర్టల్ కు ఫోన్ (1930) చేసి.. తాము మోసపోయిన విషయాన్ని తెలియజేస్తే.. తక్షణమే నేరస్థుల బ్యాంకు ఖాతాల్ని స్తంభింపచేసేందుకు దేశ వ్యాప్తంగా 190 బ్యాంకులు.. ఈ వ్యాలెట్లు కలిసి పని చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు దోచేసిన మొత్తం రూ.587 కోట్లు ఉంటే.. రెండేళ్లలో బాధితులకు పోలీసులు ఇప్పించిన మొత్తం మాత్రం రూ.12.01 లక్షలు మాత్రమే ఉండటం గమనార్హం.