ఫిబ్రవరి 1 శుక్రవారం 2019 దినఫలాలు

Update: 2019-02-01 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: పనులు నత్తనడకన సాగుతాయి. పరిస్థితులు అనుకూలించవు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు బదిలీలు. ఐటీ ఉద్యోగుల అంచనాలు తారుమారవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు నిరుత్సాహం. శివస్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపార లావాదేవీలు సాధారణంగా ఉంటాయి. విధుల్లో ఒత్తిడులు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి నిరాశాజనకం. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. విద్యార్థులకు మానసిక అశాంతి. మహిళలకు కుటుంబంలో చికాకులు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మిథున రాశి: శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహా యత్నాలు ముమ్మరం చేస్తారు. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహాకరంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు ఆహ్వానాలు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు శుభసమాచారం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

కర్కాటక రాశి: చిరకాల వాంఛ నెరవేరుతుంది. సన్నిహితులతో విబేధాలు తొలగిపోతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు పరిశోధనల్లో విజయం సాధిస్తారు. ఐటీ ఉద్యోగులకు కొంతమేరు అనుకూలం. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. సుబ్రహ్మణ్వేశ్వరుడిని పూజించడం మంచిది.

సింహ రాశి: ఆశించిన ఫలితం దక్కదు. కుటుంబంలో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగులకు స్థాన మార్పులు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. ఐటీ నిపుణుల కష్టానికి ఫలితం దక్కదు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక అశాంతి. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

కన్యారాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రత్యర్థులు సమస్యలు సృష్టిస్తారు. బంధువులతో తగాదాలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి చికాకులు. ఐటీ నిపుణులకు అరుదైన సన్మానాలు. విద్యార్థులకు ఫలితాల్లో నిరాశ. మహిళలకు కుటుంబ సమస్యలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

తులారాశి: అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. రియల్ ఎస్టేట్ వారికి భూలాభాలు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. సంఘంలో గౌరవం దక్కుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.  రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి కార్య సిద్ధి. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులకు అనుకూలతలు. మహిళలకు శుభశ్రవణం. వేంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ ఫలించదు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు చేజారుతాయి. ఐటీ ఉద్యోగులకు నిరుత్సాహం. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు ఆరోగ్య భంగం. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, వివాహా యత్నాలు ఫలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. రియల్  ఎస్టేట్ వారికి అనుకూల సమయం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి ఊహించని సన్మానాలు. ఐటీ నిపుణులకు పుర్కస్కారాలు. విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు. మహిళలకు సన్మానాలు దక్కుతాయి. సత్యానారాయణ స్వామిని పూజించడం మంచిది.

మకర రాశి: మానసిక ఆందోళన. ప్రయాణాల్లో ఆటంకాలు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమాధిక్యం. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక, రాజకీయవర్గాల వారికి నిరాశ. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులు కొంత సంయమనం పాటించాలి. మహిళలకు కుటుంబ సమస్యలు. గణపతిని పూజించడం మంచిది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసులు. పెట్టుబడులు సమకూరుతాయి. వ్యాపార లావాదేవీల్లో ఉత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు సమస్యల నుంచి విముక్తి. విద్యార్థులను ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. మహిళలకు శుభసమాచారం. గాయత్రీదేవీని ధ్యానించడం మంచిది.

మీనరాశి: వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు దగ్గరవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కొంత ఊరట లభిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం దక్కుతుంది. గణేశాష్టకం పఠించడం మంచిది.
Tags:    

Similar News