కొన్ని కోట్ల మంది బౌద్దులకు అరాధ్య దైవం దలైలామా. ఆయన దర్శనం కోసం వారంతా తపించిపోతుంటారు. ఆయన స్పర్శ కోసం.. ఆయన మాట కోసం.. ఆయన చూపు కోసం వారెంతగానో తహతహలాడిపోతారు. నడిచే దైవంగా అభివర్ణించిన ఆయనే..బౌద్ధగురువు దలైలామా. కంటి ఎదుట కనిపించే దైవంగా కొలిచే దలైలామాను కలిసేందుకు సామాన్యులతో పాటు.. వీవీఐపీలు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.
అలాంటి దలైలామా ఒక సామాన్యుడైన రిటైర్ అయిన అధికారి ఇంటికి వెతుక్కుంటూ వెళ్లారు. ఆయనే స్వయంగా గుర్తు పెట్టుకొని మరీ ఒక సామాన్యుడి ఇంటికి వెళ్లటం ఇప్పుడు ఆసక్తికరంగామారింది. అసోంలోని గువాహటికి ఆదివారం వచ్చిన ఆయన.. అప్పుడెప్పుడో రిటైర్ అయిన అస్సాం రైఫిల్స్ మాజీ జవాన్ నరేన్ చంద్రదాస్ ను ప్రత్యేకంగా కలిశారు. అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఒక రిటైర్ అయిన అధికారి ఇంటికి దలైలామా ఎందుకు వెళ్లారన్న విషయంలోకి వెళితే..ఆసక్తికరమైన అంశం ఒకటి బయటకు వస్తుంది. ఇంతకీ దాస్ గొప్పేమంటే.. 1959లో దలైలామాను సీక్రెట్ గా చైనా ఆక్రమిత టిబెట్ నుంచి భారత్ కు తరలించిన సైనిక బృందంలోని సభ్యుడు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఒకటి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో దాస్ ఒక సభ్యుడు. తనను సేఫ్ గా తరలించిన ఐదుగురు జాడ కోసం ప్రయత్నించగా..ఒక్క దాస్ ఆచూకీమాత్రమే లభించింది.దీంతో.. ఆయనకు థ్యాంక్స్ చెప్పేందుకు ఆయన ఇంటికే నేరుగా వెళ్లారు దలైలామా. నడిచే దేవుడు తన ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన వైనంతో దాస్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/