ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఊహించని నిరసన ఎదురైంది. అది కూడా గిఫ్ట్ రూపంలో కావడం ఆసక్తికరం. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం నుంచి ఆ నిరసన రూపం వ్యక్తమవడం ఎదురవడం గమనార్హం. గత నెలలో సీఎం వస్తున్నారంటూ యూపీలోని మెయిన్ పూర్ దళితవాడలోని వారికి సబ్బులు - సెంట్లు - షాంపూలు ఇచ్చి శుభ్రంగా స్నానం చేయండంటూ అక్కడివారిని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే కదా. దీనికి నిరసనగా గుజరాత్ కు చెందిన దళిత సంఘం వినూత్నంగా తమ నిరసన తెలిపింది.
125 కేజీల బరువు - 16 అడుగుల పొడవున్న సబ్బును గుజరాత్ కు చెందిన ఓ దళిత సంఘం పంపించింది. ఇప్పుడు తాము పంపిన సబ్బుతో స్నానం చేసిన తర్వాత సీఎం యోగి దళితులను కలవొచ్చని గుజరాత్ కు చెందిన అంబేద్కర్ వేచన్ ప్రతిబంధ్ సమితి చెబుతోంది. యోగికి కుల గజ్జి ఉన్నదని ఈ ఘటనతోనే తెలుస్తోందని, మొదట ఆయన వీటి నుంచి తనను తాను శుభ్రం చేసుకోవాలని సమితికి చెందిన సభ్యులు అన్నారు. గౌతమ బుద్ధుని ప్రతిమ ఈ సబ్బుపై ఉంచారు. ఈ సబ్బు తయారీకి రూ.3200 ఖర్చయిందని గుజరాత్ లోని దళిత సంఘం క్లారిటీ ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/