తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బీపీ పెంచేస్తున్నారు. పార్టీలో చేరింది మొదలు ఏదో పేచీ తెచ్చిపెట్టేస్తున్న భూమా ఇపుడు తన వల్ల ఏకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు రాస్తారోకో చేసేందుకు కారణం అయ్యారు.
భూమా నాగిరెడ్డి తమ పట్ల అవహేళనగా మాట్లాడాడని ఆరోపిస్తూ, కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులు రాస్తారోకో నిర్వహించారు. కర్నూలు - గుంటూరు రహదారిపై పాములపాడు వద్ద రోడ్లను దిగ్బంధించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా భూమాను కలిసిన కొందరు దళితులు, తమకు అంబేద్కర్ భవన్ ను కట్టించాలని కోరగా ఆయన మండిపడ్డారట. తినడానికి తిండిలేని వారికి అంబేద్కర్ భవన్ అంత అవసరమా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దుర్భాషలాడారని ఆరోపిస్తూ పలువురు ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమా నాగిరెడ్డితో క్షమాపణ చెప్పించాలని ఈ సందర్భంగా దళితులు డిమాండ్ చేశారు.