మాజీ ఉప ముఖ్యమంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. కేసీఆర్ అవకాశవాది అని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను ఇచ్చేంత వరకు సోనియాగాంధీ చుట్టూ తిరిగి తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియాగాంధీకి వెన్నుపోటు పోడిచారని అన్నారు. తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసిన ఘనత సోనియా గాంధీకే దక్కిందన్నారు. అయితే మాయమాటలతో అధికారంలో వచ్చిన తెరాస ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేక పోయిందని, రైతుల రుణ మాఫీ చేయకుండా కాలం వెల్లదీస్తుందన్నారు. ఇంటింటికి ఉద్యోగం అంటూ ప్రజలను మభ్య పెట్టిందని, 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇంకా ఏం మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడ ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలని దామోదర డిమాండ్ చేశారు.
రెండు సంవత్సరాలలో టీఆర్ ఎస్ చేసిందేమిటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని దామోదర డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాలకు సిద్ధపడగా ఇప్పుడు కొత్తగా కేసీఆర్ నిర్మిస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. 2013 చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న రైతులకు చట్ట ప్రకారం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 123 జీవో ఎవరి కోసం తెచ్చారో బయటపెట్టాలన్నారు. మాటల గారడి తప్ప ప్రభుత్వం చేతల్లో ఏమీ చేయడం లేదన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నా రని చెప్పారు. 2018 నుంచి తన సత్తా ఏమిటో చూపిస్తామని, 2019లో తెరాసకు తగిన గుణపాఠం ఖాయమని దామోదర అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతంగాఉందని కార్యకర్తలు అదైర్య పడోద్దని పార్టీ జిల్లా ఇన్ ఛార్జి - మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యమం కింద స్థాయి నుండే వస్తుందని దానికి ప్రజలను సన్నద్దం చేయాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మండల స్థాయి - జిల్లా స్థాయి - రాష్ట్ర స్థాయిల్లో శిక్షణ శిభిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ - ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. డీసీసీ అధ్యక్షురాలు - మాజీ మంత్రి సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకే పరిమితమయ్యారని కుటుంబ సభ్యుల పాలన కొనసాగిస్తూ ఇతరులను ఎదగకుండా చేస్తున్నా రన్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిందని అటుపోట్లు తట్టుకునే శక్తి కాంగ్రెస్ కే ఉందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.