వెండితెర‌కెక్క‌నున్నమ‌రో తెలుగు సీఎం జీవితం.. ఎవ‌రంటే?

Update: 2021-02-14 23:30 GMT
రాజ‌కీయ నేత‌ల జీవితాలు వెండితెర‌పై సినిమాలుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కేంద్రం నుంచి రాష్ట్రాల వ‌ర‌కు పాల‌కులుగా  వ్య‌వ‌హ‌రించిన నేత‌ల జీవితాలు సినిమాలుగా వ‌చ్చి.. అభిమానుల‌నే కాకుండా అన్ని వ‌ర్గాల‌ను అల‌రించిన సంద‌ర్భాలు ఉన్నా యి. ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. తెలుగు ప్ర‌జ‌ల అన్న‌గారు, దివంగ‌త సీఎం ఎన్టీఆర్ జీవితం రెండు భాగాలుగా వెండితెర‌పై న‌ర్తించింది. అదేస‌మ‌యంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవితం కూడా సినిమాగా వ‌చ్చింది. మ‌న తెలుగు నాట‌.. ఈ ఇద్ద‌రి జీవితాలే ఇప్ప‌టి వ‌ర‌కు వెండితెర‌పైకెక్కాయి.

అయితే.. వీరిద్ద‌రి జీవితాలు వెండితెర‌కు ఎక్క‌డం వెనుక రాజ‌కీయాలు, ఎన్నిక‌ల ఓటు బ్యాంకు కార‌ణాలు ఉన్నాయ‌నే విమ‌ర్శ ‌లు ఉన్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అటు టీడీపీ, ఇటు వైసీపీలు ఎన్టీఆర్‌, వైఎస్ జీవితాల‌ను వెండితెర కెక్కించి.. ఓట‌ర్ల‌ను త‌మ వైపున‌కు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు స‌క్సెస్ అయ్యాయ‌నే విష‌యం ప‌క్క‌న పెడితే.. ఉమ్మ‌డి ఏపీని పాలించిన ఎంతో మంది ముఖ్య‌మంత్రులు ఉన్న‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రి జీవితాలు మాత్ర‌మే సినిమాలుగా రావ‌డం రికార్డ‌నే చెప్పాలి.

అయితే.. ఇప్పుడు మ‌రో కీల‌క ముఖ్య‌మంత్రి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఏలిన వివాద ర‌హిత నాయ‌కుడు, ముఖ్యంగా ద‌ళిత సామా జిక వ‌ర్గానికి చెందిన నేత‌.. దామోద‌రం సంజీవ‌య్య జీవితం కూడా వెండితెర‌పైకి ఎక్క‌నుంది. ప్ర‌జా నాయ‌కుడిగా.. ఉన్నా.. నిరాడంబ‌ర జీవితాన్ని గ‌డిపి.. చ‌రిత్ర‌లో చిర‌స్థాయి చోటు సంపాయించుకున్న సంజీవ‌య్య.. నేటి త‌రానికి తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ.. ఆయ‌న వేసిన అడుగులు.. ఏపీలో చేప‌ట్టిన అభివృద్ధి అనేవి మాత్రం ఇప్పటికీ నిలుస్తాయి. ప్ర‌స్తుతం ఆయ‌న శ‌త‌జ‌యంతి వేడుక‌లు జ‌రుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో `సాంధ్య‌శ్రీ సినిమా క్రియేష‌న్స్‌` సంస్థ‌.. దామోద‌రం సంజీవ‌య్య జీవితాన్ని తెర‌కెక్కించాల‌ని నిర్ణ‌యించింది. త‌మిళ‌నాడుకు  చెందిన `ద్రావిడ‌దేశం` స్వ‌చ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కృష్ణారావు.. ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా వివ‌రాలు వెల్ల‌డించ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. మొత్తానికి మ‌న తెలుగు వాడిగా.. అటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ చ‌క్రం తిప్పి.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న సంజీవ‌య్య జీవితం తెర‌మీద‌కెక్క‌డం.. ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News