దానం కూడా ఐస్ క్రీంలు అమ్ముతాడట

Update: 2017-04-15 14:05 GMT
ఈ నెల 27న వరంగల్ లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభ కోసం మంత్రి కేటీఆర్ ‘గులాబీ కూలీ’ పేరుతో శుక్రవారం ఒక హోటల్లో కోల్డ్ కాఫీ తయారు చేయడం.. ఐస్ క్రీమ్స్ అమ్మడం తెలిసిన సంగతే. దీని ద్వారా ఆయన రూ.7 లక్షలు సంపాదించారు. ఐతే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నాడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్. మంత్రి కేటీఆర్ ఒక్క రోజు కూలి పని చేస్తే రూ.7 లక్షలు రావడం విడ్డూరమని దానం అన్నారు. నెల రోజులు కష్టపడి పని చేసేవారు నెల మొత్తానికి రూ.20 వేలు కూడా సంపాదించట్లేదని.. అలాంటిది రోజుకు రూ.7 లక్షలు కూలి రావడం ఏంటని దానం అన్నారు. టీఆర్ ఎస్ కూలీ కార్యక్రమం ఒక డ్రామా అని దానం అభివర్ణించారు.

కేటీఆర్ ఐస్ క్రీంలు అమ్మిన చోటే తాము కూడా అదే పని చేస్తామని.. తమకు కేటీఆర్ కు వచ్చిన స్థాయిలో కూలి రాకపోతే అక్కడే బైఠాయిస్తామని దానం హెచ్చరించారు. టీఆర్ ఎస్ ప్లీనరీకి ఇలా కూలి పేరుతో విరాళాలు సేకరించడం విడ్డూరమని.. ఆ ప్లీనరీకి ఎవరెవరు ఫండింగ్ ఇస్తున్నారో తమకు తెలుసని.. ఆ లిస్ట్ తమ దగ్గర ఉందని దానం అన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ట్యాంక్ బండ్ మీద ప్రజాస్వామ్యయుతంగా నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు దానం తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ మీద కేటీఆర్ నోరు పారేసుకోవడం సరికాదని ఆయన అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News