గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం కావడం పట్ల నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ అధిష్ఠానానికి పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే.... ఇంతకుముందే టీఆరెస్ లో చేరుతారని భావించిన దానం కొన్ని కారణాల వల్ల ఆ పార్టీలో చేరలేకపోయారు. తాజాగా ఆయన పార్టీ పదవికి రాజీనామా చేయడంతో పాటు త్వరలో కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెబుతారని... టీఆరెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.
తన రాజీనామా ప్రకటన అనంతరం విలేకరులతో మాట్లాడిన దానం... ప్రజలు టీఆరెస్ ను నమ్మారు కాబట్టే ఓట్లేసి గెలిపించారని.... ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు కూడా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలని సూచించారు. ఓటమి పాలైనా తాను కాంగ్రెస్ పార్టీ సైనికుడినే అని ఆయన చెబుతున్నప్పటికీ ఆయన ఎంతో కాలం కాంగ్రెస్ లో ఉండరని అనుచరులే అంటున్నారు. ఎన్నికలకు ముందు ఆయన్ను కేవలం గ్రేటర్ కే పరిమితం చేయడం... సిటీ పరిసర జిల్లాల్లో తలదూర్చవద్దని పీసీసీ నేతలు హెచ్చరించడం వంటివి ఆయన సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. అంతేకాదు... ఉప్పల్ లో రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలు ఆయనపై దాడి చేయడం వంటి ఘటనల నేపథ్యంలో.. దారుణ పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ లో ఉంటే తన పాపులారిటీ - హోల్డ్ దెబ్బతింటుందని... అధికార పార్టీలో ఉంటే బెటరని భావిస్తున్నారని సమాచారం.