సైనికులకు శృతి సాహసోపేతమైన థాంక్స్!

Update: 2016-11-11 12:37 GMT
"భారత్ మాతాకీ జై" అంటుంటాం, "తల్లీ భారతి వందనం" అని నమస్కరిస్తుంటాం. భారతమాతను రక్షించడంకోసం, శతృవుల చూపుసైతం తల్లిమీద పడకుండా సైనికులు నిత్యం సేవలు చేస్తూనే ఉంటారు.. తల్లి సేవలో తరిస్తూ ఉంటారు. వారందరికీ సాదారణ పౌరులంతా ఎలా ధన్యవాదాలు చెబుతారనే సంగతి పక్కనపెడితే... తాజాగా శాస్త్రీయ నృత్యకారిణి శృతిగుప్తా అత్యంత భిన్నంగానే కాకుండా మరింత సాహసోపేతంగా సైనికుల సేవలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇలా సైనికుల సేవలకు ధన్యవాదాలు చెప్పాలన్న లక్ష్యంతో సముద్రమట్టం నుంచి సుమారు 18,380 అడుగుల ఎత్తులో కథక్ నృత్యప్రదర్శన చేశారు.. తన నృత్యంతో సైనికులను ఆహ్లాద పరిచారు. ఇందుకుగానూ హిమాచల్ ప్రదేశ్ లోని లాహూల్ జిల్లాలో మైనస్ 24 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణ పరిస్థితుల్లో సుమారు 20 నిమిషాలపాటు నిరంతరాయంగా కథక్ నృత్య ప్రదర్శన చేశారు. ఐటీబీపి (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) - భారత సైన్యం సమక్షంలో ఇండో-చైనా బోర్డర్ లో ఆమె ఈ ప్రదర్శన చేశారు.

శ్రుతి గుప్తా స్వస్థలం సిమ్లా కాగా - ప్రస్తుతం ఈ ప్రాంతంలో సాంస్కృతిక రంగం అభివృద్ధిలో భాగస్వాములయ్యే విధంగా బాలికలను ప్రోత్సహించాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఆమె రెండుసార్లు లిమ్కా ప్రపంచ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News