మహమ్మారి వైరస్ భారతదేశంలో ప్రమాదకర రీతిలో వ్యాపిస్తోంది. రికార్డుల మేర కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల సంఖ్య రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 28,637 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరగడం తప్ప తగ్గడం లేదు. తాజాగా 551 మరణాలు సంభవించినట్లు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,49,553గా ఉంది. దేశంలో మరణాల సంఖ్య 22,674కు చేరింది.
ఇప్పటివరకు వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,34,621. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 2,92,258. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 2,46,600 పాజిటివ్ కేసులు నమోదవగా మరణాలు 10,116కు చేరాయి. ఆ తర్వాత తమిళనాడు నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 1,34,226 ఉండగా.. మరణాలు 1,898 ఉన్నాయి. ఇక ఢిల్లీలో 1,10,921 పాజిటివ్ కేసులు.. మరణాలు 3,334 సంభవించాయి. ఈ విధంగా దేశంలో మహమ్మారి వైరస్ కల్లోలం సృష్టిస్తోంది.