తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతి రోజురోజుకు పెరుగుతుండడం.. రోగుల సంఖ్యలో పదుల సంఖ్యలో ఎగబాకుతుండడంతో కేసీఆర్ సర్కార్ మరింత అప్రమత్తమైంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు నివసిస్తున్న ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరు కరోనా హాట్ స్పాట్స్ ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు తాజాగా ప్రకటించింది.
కరోనా వ్యాధి సోకి కూడా బయటకు చెప్పని ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా వర్గీకరించి హాట్ స్పాట్స్ గా ప్రకటించింది. తెలంగాణలో ఈ హాట్ స్పాట్స్ ఇవే..
1. హైదరాబాద్ పాతబస్తీ
2. గద్వాల్
3. మిర్యాలగూడ
4. నిజామాబాద్
5. నిర్మల్
6. భైంసా
ఈ ఆరు నగరాలను హాట్ స్పాట్స్ గా గుర్తించి ఇక్కడ మరింత లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది.
ఈ ప్రాంతాల్లో ఢిల్లీ వెళ్లివచ్చిన వారు లాక్ డౌన్ ఉల్లంఘించి బయట తిరిగారని.. పలువురిని కలిశారని.. ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చారని పోలీసులు గుర్తించారు. వారు ఇక బయట తిరగకుండా ఈ ఆరు హాట్ స్పాట్స్ లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు.
*నిబంధనలు ఇవీ
ఈ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మూడు కి.మీల పరిధి వరకు ఎవరినీ అనుమతించరు. ఒక్క ఉన్న వారిని బయటకు వెళ్లనీయరు. బయట నుంచి ఇతరులను లోపలికి అనుమతించరు.