కరోనా కంటే డేంజర్​.. మనదేశంలో మరో కొత్తవైరస్​..!

Update: 2021-03-07 06:41 GMT
గత ఏడాది కరోనా మహమ్మారి దెబ్బకు అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైరస్​ బారిన పడి ప్రత్యక్షంగా కొంతమంది.. వైరస్​ సృష్టించిన భయంతో మరికొంతమంది విలవిలలాడిపోయారు. కరోనా చాలా మంది జీవితాలను తారుమారు చేసింది. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. మరెంతోమంది మానసిక క్షోభను అనుభవించారు. అయితే ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్​ వచ్చేసింది. వ్యాక్సినేషన్​ కూడా ప్రారంభమైంది. కానీ కరోనా కేసులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే మనకు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మరో వింత వ్యాధి కలకలం సృష్టిస్తున్నది. అదే మంకీ వైరస్​.

ఆ భయంకరమైన వ్యాధిపేరు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD). దీన్ని మంకీ ఫీవర్ (Monkey fever)అని కూడా పిలుస్తారు.

 అయితే ఈ మహమ్మారిని కర్ణాటకలోని శివమొగ్గలో గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కోతుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని డాక్టర్లు అంటున్నారు.

క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్‌.. కోతుల నుంచి మనుషులకు సోకుతుంది. మొదట్లో ఈ వ్యాధి  కేరళలో వెలుగుచూసింది. చిన్నగా కర్ణాటకకు వ్యాపించింది. మొదట కేరళ​- కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉండే వాయనాడ్ జిల్లాలో తొలిసారిగా దీన్ని గుర్తించారు.  ఈ వ్యాధి గతంలోనూ  పలుమార్లు వచ్చింది.

2019, 2020లో ఈ వ్యాధి విజృంభించింది. అప్పట్లో కర్ణాటక, కేరళలోని మొత్తం 12 జిల్లాల్లో ఈ మహమ్మారి కనిపించింది.  కర్ణాటకలో మంకీ ఫీవర్ విజృంభిస్తోన్నట్లు అధికారులు అలర్ట​య్యారు. పరీక్షలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే  దాదాపు 2500 మందికి పరీక్షలు నిర్వహించిట్టు వైద్య సిబ్బంది తెలిపారు. శివమొగ్గ జిల్లాలో ఇద్దరికి.. మల్నాడ్ రీజియన్‌లో మరో ఇద్దరికి మంకీ ఫీవర్​ సోకింది.  చిక్‌మగళూరు జిల్లా ఎన్‌ఆర్‌ పుర తాలూకాలో మరో కేసు వెలుగులోకి వచ్చింది.

లక్షణాలు..

జలుబు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, రక్తస్రావం, లో బీపీ, ప్లేట్ లెట్ కౌంట్​ తగ్గిపోవడం, ఎర్ర రక్తకణాలు క్షణించడం వంటి మంకీ ఫీవర్​ లక్షణాలని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.సాధారణ వైద్యం ద్వారా కోలుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు.

వ్యాధి ముదరక ముందే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మరితో జనాలు అతలాకుతలం అవుతుంటే .. మంకీ ఫివర్​ రూపంలో మరో ముంపు ముంచుకొచ్చిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అయితే ఈ వ్యాధి అటవీ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ఆయా చోట్ల వైద్య సిబ్బంది క్యాంపులు నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News