కరోనా షాక్: ట్రంప్ టైం బాగోలేదు.. భారత్ ను బీట్ చేసి మళ్లీ ఫస్ట్ ప్లేస్ కి అమెరికా

Update: 2020-10-20 05:30 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. ప్రపంచంలో మరే దేశంలో లేని రీతిలో మనిషి ప్రాణానికి అమెరికాలో ఇచ్చే ప్రాధాన్యత అంతఇంతా కాదు. అలాంటి దేశంలో కరోనా లాంటి వైరస్ కారణంగా 2.25లక్షల మంది మరణించారు. అమెరికాలో ఇన్ని మరణాలు ఒక సందర్భంలో చోటు చేసుకోవటం ఇప్పటివరకు లేదు. ఇదిలా ఉంటే.. అధ్యక్ష ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ.. అధ్యక్ష స్థానం కోసం మరోసారి పోటీ పడుతున్న ట్రంప్ టైం ఏ మాత్రం బాగోలేదు. ఇప్పటికే పలు అంశాల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇది సరిపోదన్నట్లుగా తాజాగా కరోనా కొత్త కేసుల నమోదు విషయంలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న భారత్ ను బీట్ చేసి.. ప్రధమ స్థానానికి చేరుకుంది అమెరికా. తాజాగా ఆ దేశంలో 50,109 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే భారత్ లో కేసుల నమోదు అంతకంతకూ తగ్గుతోంది. ఆ మధ్య వరకు రోజుకు 90వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు రూ.50వేలకు తగ్గిపోయింది. మరణాల సంఖ్య కూడా తగ్గింది. దీంతో.. భారత్ లో కరోనా ప్రభావం కాస్త తగ్గినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ చూస్తే..  చాలా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క సోమవారం రోజున 3.3లక్షల కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో.. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 4.06కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 11.22లక్షల మంది ఇప్పటివరకు మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 91.65 లక్షలుగా చెబుతున్నారు. వీరిలో ఒక శాతం కంటే తక్కువగా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో టాప్ ఫైవ్ చూస్తే.. అమెరికా మొటి స్థానంలో.. రెండో స్థానంలో భారత్.. మూడో స్థానంలో బ్రెజిల్.. నాలుగో స్థానంలో బ్రిటన్.. ఐదో స్థానంలో రష్యా దేశాలు ఉన్నాయి. మరణాల విషయంలోకి వస్తే.. భారత్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో అర్జెంటీనా.. మూడో స్థానంలో అమెరికా.. నాలుగో స్థానంలో ఇరాన్ లు ఉన్నాయి. ఇదంతా చూస్తున్నప్పుడు మరోసారి పెద్ద ఎత్తున కేసుల నమోదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బ్యాడ్ న్యూస్ గా చెప్పక తప్పదు.
Tags:    

Similar News