వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అగ్రరాజ్యానికి కరోనా దడ ఎంతంటే?

Update: 2020-12-16 03:21 GMT
రోజుకు 90 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి.. 60వేలకు తగ్గి కాస్తంత ఊపిరిపీల్చుకునేలా చేసిన కరోనా.. తాజాగా కేసుల సంఖ్య మరింత తగ్గిపోవటం భారతదేశానికి భారీ ఉపశమనం కలిగేలా చేస్తోంది. తాజాగా రోజుకు 22065 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అది కూడా కేరళ.. ఢిల్లీ.. తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాల్ని మినహాయిస్తే.. కేసుల నమోదు భారీగా తగ్గినట్లుగా చెప్పాలి. ఎక్కడిదాకానో ఎందుకు.. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదయ్యే ఏపీలో ఇప్పుడు రెండు వేల కేసుల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇక.. తెలంగాణలో అయితే.. నాలుగు అంకెలు కాస్తా.. మూడు అంకెలకు పరిమితమైన పరిస్థతి.

వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకున్నా.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతుంటే.. అందుకు భిన్నంగా విదేశాల్లో మాత్రంపరిస్థితి మరోలా ఉంది. ఎక్కడిదాకానో ఎందుకు అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రస్తుతం రోజుకు 2.09,425 కేసులు నమోదువుతన్నాయి. ప్రపంచంలో ఒక రోజులో నమోదయ్యే కేసుల్లో దాదాపు 30 శాతానికి పైనే కేసులు ఒక్క అమెరికాలోనే నమోదు కావటం గమనార్హం. ఓపక్క వ్యాక్సిన్ రావటం.. అమెరికాకు శుభవార్తగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ పేర్కొంటుంటే.. కేసుల నమోదు ఏ మాత్రం తగ్గకపోవటం ఆ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

అమెరికా పరిస్థితి ఇలా ఉంటే.. బుజ్జి దేశమైన టర్కీలో 32,102 కేసులు రోజులో నమోదవుతున్నాయి. తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. ఆదేశంలో మంగళవారం ఒక్కరోజులో 30,706 కేసులు నమోదు అయితే.. నాలుగో స్థానంలోరష్యా నిలిచింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికి ఈ దేశంలో రోజుకు 26,689 మందికి పాజిటివ్ గా తేలింది. ఇక.. భారత్ తర్వాత అధికంగా కేసులునమోదవుతున్న దేశంగా జర్మనీ నిలిచింది. ఈ చిన్ని దేశంలో మంగళవారం ఒక్కరోజునే 20,508 కేసులు నమోదువుతున్నాయి. ఇదంతా చూసినప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా చాలా దేశాలు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News