బ్రిటన్, అమెరికాలో కరోనా విలయం

Update: 2021-01-02 06:30 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ శీతల దేశాలను పట్టి పీడిస్తోంది. కరోనా తీవ్రత తగ్గిందని అనుకుంటుంటే.. బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త కరోనా స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయపెడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 8.43 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య కూడా భారీగా నమోదవుతోంది. నిన్న ఒక్కరోజు దాదాపు 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కాగా బ్రిటన్, అమెరికా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ కల్లోలంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

నిన్న అమెరికాలో ఒక్కరోజులో 1,63,252 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. 2085 మంది కరోనాతో మృతి చెందారు. కొత్త స్ట్రెయిన్ బయటపడిన యూకేలో ఒకరోజులో 53285 కరోనా కేసులు నమోదయ్యాయి. 613 మంది కరోనాతో మృతి చెందారు. బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ కేసులతోపాటుగా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.
Tags:    

Similar News