భూలోక స్వర్గంగా అభివర్ణించే ప్రపంచ మహానగరాల్లో ఒకటైన లాస్ ఏంజెలెస్ ఇప్పుడు ఎంత దయనీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయో తెలిస్తే షాక్ తినాల్సిందే. కరోనా ఎంట్రీ మొదలు ఇప్పటివరకు అత్యంత దారుణమైన పరిస్థితులు అమెరికాలో చోటు చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. అమెరికా మీద దాని ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతి ఎక్కువ కేసుల నమోదుతో పాటు.. మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అమెరికా విలవిలలాడిపోతోంది.
అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన లాస్ ఏంజెలెస్ మహానగరంలో మృతువు హల్ చల్ చేస్తోంది. నగరంలోని అంత్యక్రియల కేంద్రాల్లో మృతదేహాల నిల్వకు చోటు సరిపోని దుస్థితి. తమ వల్ల కాదంటూ వాటి నిర్వాహకులు చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో.. ప్రపంచానికే పెద్దన్న లాంటి దేశంలో మృతదేహాల్ని ఉంచేందుకు కూడా అవకాశం లేని దరిద్రపు పరిస్థితి ఇప్పుడుచోటు చేసుకుంది.
తాను నలభై ఏళ్లుగా అంత్యక్రియలు జరిపించే పని చేస్తున్నానని.. వచ్చిన మృతదేహాల్ని స్థలం లేదని వెనక్కి పంపించే రోజు ఒకటి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని స్థానిక ఫ్యునరల్ హోం యజమాని మగ్దా ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు తాము ముఫ్ఫై మృతదేహాలకు అంత్యక్రియలు జరుపుతున్నామని.. సాధారణంతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువని చెబుతున్నారు. అమెరికా వ్యాప్తంగా రోజుకు 2500 మంది కరోనాకారణంగా మరణిస్తున్నారు.
లాస్ఏంజెలెస్లోని ఆసుపత్రులకు కరోనా బాధితులు భారీగా వస్తున్నారు. వారి రాకతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. రోగులకు అందించాల్సిన ఆక్సిజన్ అందుబాటులో లేని పరిస్థితి. లూసియానా.. టెక్సాస్ తో సహా పలు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కరోనాకేసులు భారీగా నమోదు అవుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఓవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. పాజిటివ్ సంఖ్య మాత్రం తగ్గకపోవటంతో అమెరికన్లు విలవిలలాడిపోతున్నారు.