అమెరికాలో బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. అమెరికాలో విజృంభిస్తోన్న యూకే వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిగా వ్యాపిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన (B.1.1.7) అనే ఈ యూకే వేరియంట్ అమెరికన్లను భయంతో వణికిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ప్రతి పది రోజులకు రెండింతల కరోనా కేసులు పెరిగిపోతున్నాయని కొత్త అధ్యయనం డేటా వెల్లడించింది.
వచ్చే మార్చి నెల సమయానికి యూకె వైరస్ భయంకరమైన మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని తేలింది. కొత్త అధ్యయనం ప్రకారం ప్రస్తుతం అమెరికాలోని ఇతర వేరియంట్ల కంటే 35 నుంచి 45 శాతం అత్యంత వేగంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపించగలదని రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు. కొత్త వేరియంట్ ఫ్లోరిడాలో చాలా త్వరగా వ్యాప్తి చెందుతోంది. అత్యధిక సంఖ్యలో B.1.1.7 వేరియంట్ కేసులు పెరిగిపోయాయి. ఫ్లోరిడాలో కొత్త వేరియంట్ తో ఇన్ ఫెక్షన్ల శాతం ఐదు శాతం కంటే తక్కువ నుంచి 10 శాతానికి పెరిగాయని ఈ అధ్యయనం చెబుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించలేకపోవడానికి మాస్క్, ఆంక్షలపై ఫ్లోరిడా కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల కేసుల తీవ్రత పెరిగి ఉండొచ్చునని నిపుణులు అంటున్నారు. ముందస్తు డేటా కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాలకు హెచ్చరిక లాంటిదనే చెప్పాలి. ప్రత్యేకించి అనేక దేశాలు కొత్త వేరియంట్‌తో ముడిపడి ఉన్న ఇన్‌ఫెక్షన్లు భారీగా పెరిగిపోతున్నాయి.