నిబంధనలు సడలించడం కొంపముంచింది... యూఎస్​లో పెరుగుతున్న కేసులు..!

Update: 2021-03-17 03:30 GMT
చైనాలోని వూహాన్​లో మొదలైన కరోనా.. ఆదేశంలో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఇతర దేశాలను గజగజ లాడించింది. ముఖ్యంగా కరోనాతో ఎక్కువగా నష్టపోయింది మాత్రం అమెరికా అని చెప్పకతప్పదు. ప్రాణ నష్టం ఆ దేశంలోనే ఎక్కువగా జరిగింది. అయితే కరోనాకు వ్యాక్సిన్​ రావడంతో అమెరికా ప్రజలు, అక్కడి ప్రభుత్వం సైతం మహమ్మారిని లైట్​ తీసుకున్నాయి. దాదాపు యూఎస్​లోని 12 రాష్ట్రాలు లాక్​డౌన్​ రూల్స్​ను సడలించాయి. ప్రజలు కూడా ఇక కరోనా పోయిందని భావించి విచ్చలవిడిగా ఎంజాయ్​ చేశారు. అదే వాళ్ల కొంపముంచింది. ప్రస్తుతం అమెరికాలో మళ్లీ కరోనా తీవ్ర రూపం దాల్చుతున్నది. అమెరికాలో అనేక రకాల కొత్త వేరియంట్​లు కూడా వ్యాప్తి చెందుతున్నాయని అక్కడి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  ఇది చాలా వేగంగా విస్తరిస్తున్నదని అక్కడి వైద్యులు అంటున్నారు.

వేసవి ప్రారంభం కావడంతో ప్రజలు భారీగా బీచ్​లకు నదీతీరాలకు వెళ్తున్నారు. ఇదో ఎంతో ప్రమాదమని ఇలా వెళ్లడం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. గత ఆదివారం అమెరికా ప్రభుత్వం విమానాశ్రయాల్లో ముమ్మరంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. మరోవైపు బీచ్​లకు, పబ్బులకు వెళ్లే ప్రజలు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీసం మాస్కులు ధరించడం లేదు. అంతేకాక భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ఇది చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్​ వేసుకున్నంత మాత్రన మాస్కులు తీసేయడం సరైన  నిర్ణయం కాదని వాళ్లు హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సిన్​ వేసుకున్నాక కూడా చాలా రోజుల తర్వాత శరీరంలో యాంటిబాడీలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి. అప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్​లో కొత్త వేరియంట్​ కేసులు నమోదయ్యాయి. మరోవైపు దక్షిణాఫ్రికా, బ్రెజిల్​లోనూ కొత్త తరహా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కొత్త వేరియంట్​ కేసులు నమోదైనప్పటికీ వాటి సంఖ్య పరిమితంగానే ఉంది.
Tags:    

Similar News