కోరిన కోర్కెలు తీర్చే తిరుమల వెంకన్న దర్శనం జూన్ 8 నుంచి ప్రారంభమైంది. కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టంగా భక్తులను నిబంధనల ప్రకారం తక్కువమందిని అనుమతిస్తున్నారు. మార్చి 25న తిరుమల శ్రీవారి ఆలయం బంద్ కాగా.. జూన్ 8 నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.
అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది.
తాజాగా ఆలయ పెద్ద జియ్యంగార్లకు కరోనా పాజిటివ్ గా తేలడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇప్పటికే టీటీడీలో 18మంది అర్చకులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయల బోర్డు అప్రమత్తమైంది. ఆలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. ఆలయంలోని అర్చకులు.. సెక్యూరిటీ, సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. అయినా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. భక్తుల ద్వారా వ్యాపిస్తోందనే అనుమానాలున్నాయి. భక్తుల దర్శనాలపై టీటీడీ పునరాలోచనలో పడినట్లు సమాచారం.