ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది. పట్టణాల నుంచి గ్రామాలకు కూడా సోకుతోంది.
తాజాగా విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో కరోనా కలకలం రేపుతోంది. ఏకంగా 9మంది గ్రామ వలంటీర్లు, ఇద్దరు పీహెచ్.సీ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
దీంతో ఇన్నాళ్లు గ్రామ వలంటీర్లతో కాంటాక్టులో ఉన్న అధికారుల్లో టెన్షన్ మొదలైంది. వారందరినీ గుర్తిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది.